త్రిష కృష్ణన్.. వర్షం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికి అవకాశాలను ఆదిపుచ్చుకుంటుంది. అయితే 37 ఎళ్ల ఈ ముద్దగుమ్మ ఇంకా పెళ్లి పీటలు ఎక్కలేకపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగివుంటే ఐదేళ్ల క్రితమే త్రిష పెళ్లి జరిగివుండేది.. నిర్మాత వరుణ్‌ మణియన్‌తో నిశ్చితార్ధం తరువాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి త్రిష పెళ్లి తెరమీదికి వచ్చింది. త్రిష త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తమిళ మీడియా కోడై కూస్తోంది.. అది కూడా వివాదాస్పద హీరో శింబును పెళ్లి చేసుకుంటుందంటూ తమిళనాట వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

తమిళ స్టార్ హీరోగా మంచి క్రేజ్ ఉన్నప్పటికీ నిత్యం వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటారు శింబు. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లతో ప్రేమాయణం సాగించిన శింబు ఆ ఇద్దరి ప్రేమలో విఫలమయ్యారు. అయితే తాజగా త్రిష, శింబుల మధ్య ప్రేమ చిగురించింది, వీరి పెళ్ళికి పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని, త్వరలో ఇద్దరు పెళ్లి పీటలు ఎక్కనున్నారని టాక్ జోరుగా ఉంది. మరి ఈ వార్తలపై త్రిష, శింబుల ఎలా స్పందిస్తారో చూడాలి. ఇప్పటికె వీరిద్దరూ “ఏమాయ చేసావే” తమిళ వెర్షన్ “వరువాయ” తోపాటు అలై అనే చిత్రంలో కలిసి నటించి భారీ విజయాన్ని అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here