Tarakaratna: నందమూరి తారకరత్న మరణ వార్త నందమూరి కుటుంబంలో మాత్రమే కాకుండా సినీ ఇండస్ట్రీలో కూడా తీవ్ర విషాదాన్ని నింపింది.తారకరత్న నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొన్ని సినిమాలలోను వెబ్ సిరీస్ లలో నటిస్తూ సందడి చేశారు. అయితే ఈయనకు రాజకీయాలపై ఆసక్తి రావడంతో తెలుగుదేశం పార్టీ తరఫున పార్టీ ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు.కుప్పం నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నటువంటి తారకరత్న ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు.
ఈ విధంగా గుండెపోటుకు గురైన తారకరత్న గత 23 రోజులుగా బెంగళూరులో చికిత్స తీసుకుంటూ ఉన్నప్పటికీ ఈయన చివరికి ప్రాణాలు కోల్పోయారు. తారకరత్న మరణించడంతో ఈయనకు సంబంధించిన అన్ని విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తారకరత్న చేతి పై ఉన్నటువంటి టాటూ గురించి ప్రస్తుతం ఓ వార్త వైరల్ గా మారింది.
తారకరత్న తన చేతిపై సింహపు టాటూ వేయించుకొని అలాగే తన బాబాయ్ బాలకృష్ణ ఆటోగ్రాఫ్ ను కూడా చేతిపై టాటూగా వేయించుకున్నారు.ఇలా సింహపు టాటూ వేయించుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే తారకరత్నకు తన బాబాయ్ బాలకృష్ణ అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమ గౌరవం కలదు.
ఇలా తన బాబాయ్ గుర్తుగా ఈయన సింహపు ఫోటోని తన చేతి పై టాటూగా వేయించుకున్నారు. అలాగే ఈ సింహపు ఫోటో కింద తన బాబాయ్ బాలకృష్ణ ఆటోగ్రాఫ్ ను కూడా టాటూగా వేయించుకున్నారు. ఇలా బాలకృష్ణ తారకరత్న మధ్య ఎంతో మంచి అనుబంధం ఉందని తెలుస్తోంది. అయితే ఈయన ఆసుపత్రి పాలైనప్పుడు బాలకృష్ణ తారకరత్న ఎలాగైనా బ్రతకాలని ఎంతో తాపత్రయపడ్డారు . చివరికి తారకరత్న మాత్రం మృత్యువు కౌగిలిలో బందీ అయ్యారు.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…