Tarakaratna friend Suresh : నందమూరి తారకరత్న కుప్పంలో జరిగిన నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొనడానికి వెళ్లి అక్కడ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి పోవడం, ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకి తరలిండం చకచకా జరిగిపోయాయి. తారకరత్న గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతో మళ్ళీ గుండె కొట్టుకునేలా 45 నిమిషాల పాటు కుప్పం వైధ్యులు శ్రమించారు. ఇక అక్కడి నుండి బెంగళూరు నారాయణ హృదయాలయ కు తీసుకెళ్లి మెరుగైన చికిత్స అందించినా ఆయన చివరకు మృత్యువుతో పోరాడి మరణించారు. ఇక ఆయన గురించిన విషయాలను ఆయన స్నేహితుడు సురేష్ పంచుకున్నారు.

నిజమైన పేరు అదే… నేను అలానే పిలుస్తా…
తారకరత్న అసలు పేరు ‘ఓబులేష్’ అంటూ ఆయన స్నేహితుడు సురేష్ చెప్పారు. చిన్నప్పడు మొదట పెట్టిన పేరు ఓబులేష్ అయితే మళ్ళీ ఎన్టీఆర్ గారు తారకరత్న అంటూ పెట్టారని, అయితే స్నేహితులందరూ ఇప్పటికీ ఓబు, ఓబులేసు అనే పిలుస్తాం. ఇక నేనైతే ఓబు, ఓబు అని లేదంటే బంగారం అంటూ పిలుస్తాను. తను ఒకరిని ఇష్టపడితే ఇక వారి కోసం ఏదైనా చేస్తాడు జీవితాంతం వదలడు, తారకరత్న స్నేహం మాకు బాగా తెలుసు అంటూ చెప్పారు.

ఇంట్లో అందరూ ఎన్టీఆర్ గారు పెట్టిన పేరుతోనే పిలుస్తారు. ఇక తాత గారంటే చాలా ఇష్టం అని అందుకే పిల్లలకు తాతగారి పేరు కలిసి వచ్చేలాగా నిశిక, తనయ్, రియా అంటూ పెట్టాడు. ఇక బాబాయ్ బాలకృష్ణ అన్నా అంతే ప్రేమ, తన సంతకంతో సింహం బొమ్మను టాటూ వేయించుకున్నాడు అంటూ తారకరత్న గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు సురేష్.



























