Tarakaratna Friend Suresh : నందమూరి తారకరత్న విషయంలో ఎవరూ ఊహించని విషాదం ఆయన కుటుంబాన్ని కమ్మేసింది. నలభై ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో మరణించి ఆయన కుటుంబాన్ని శోక సంద్రంలో నెట్టారు. తారకరత్న గారు సినిమాల్లో అంతగా రానించకపోయినా మంచి వాగ్దాటి ఉండటంతో టీడీపీ లో ఈసారి ఎమ్మెల్యే కి పోటీచేయాలని భావించారు. అయితే ఆయన ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్లు ఆయన అందరికీ శాశ్వతంగా దూరమయ్యరు. ఆయన వ్యక్తగత జీవితంలోనూ ఇప్పుడిప్పుడే తన ప్రేమ వివాహం వల్ల దూరమైన కుటుంబం మళ్ళీ కలుసుకుంటారు అనుకునే సమయానికి ఆయనే శాశ్వతంగా దూరం అయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో అలేఖ్య రెడ్డికి అందరూ ధైర్యం చెబుతున్నారు. ఇక తారకరత్న ఫ్రెండ్ సురేష్ అలేఖ్య రెడ్డి తారకరత్న బాండింగ్ గురించి వివరించారు.

అలేఖ్య రెడ్డి ఇచ్చిన అతి పెద్ధ గిఫ్ట్ అదే…
తారకరత్న ఎవరినైనా ఇష్టపడితే వారిని అసలు వదిలి పెట్టడంటూ సురేష్ చెప్పారు. తాను ఫ్రెండ్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడని చెప్పారు. ఇక అలేఖ్య ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తారకరత్న పెళ్లి రోజు అలేఖ్య మన పెళ్ళికి మన కుటుంబం ఎవరూ లేరని బాధపడుతుంటే నీకన్నా నీ చెల్లి వచ్చింది నాకంటూ మా కుటుంబం నుండి ఒక్కరూ లేరు నాకన్నా నువ్వే లక్కీ అంటూ చెప్పాడట. ఇక పెళ్లయ్యాక అలేఖ్య ఫ్యామిలీ తారకరత్న ను కొడుకులాగ చూసుకున్నారంటూ చెప్పారు సురేష్.

ఇక బాబాయ్ బాలకృష్ణ అంటే తారకరత్న కు ఎంత ఇష్టమో అలేఖ్య కు బాగా తెలుసు, అందుకే తారకరత్న పుట్టినరోజుకు బాలకృష్ణ ను పిలిచి తారకరత్న కు సర్ప్రైజ్ చేసింది. ఆరోజు తారక్ ఎంత త్రిల్ అయ్యాడో మాటల్లో చెప్పలేను. ప్రతిసారి ఏదో ఒక స్పెషల్ డే కో లేక బర్త్ డే కో తారకరత్న కు వాచ్ లాంటివి ఇష్టమని అవి గిఫ్ట్ గా ఇస్తూ ఉంటుంది అలేఖ్య అంటూ వారి బాండింగ్ గురించి చెప్పారు సురేష్.



























