Tarakaratna: నందమూరి తారకరత్న మరణ వార్తను ఇటు సినీ ఇండస్ట్రీ అటు నందమూరి అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 23 రోజులపాటు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ చివరికి ఈయన ఆఖరి శ్వాస వదిలారు. ఈ విధంగా తారకరత్న మరణించడంతో ఈయనకు సంబంధించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ క్రమంలోనే తారకరత్న స్పృహ తప్పి పడిపోవడానికి కొన్ని నిమిషాలకు ముందు ఈయన ఎంతో సరదాగా మాట్లాడుతూ కనిపించారు. ఇలా సరదాగా ఉన్నటువంటి తారకరత్న ఒక్కసారిగా కుప్ప కూలిపోవడంతో తారకరత్నకు సంబంధించిన ఈ ఆఖరి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా కుప్పం నియోజకవర్గంలో ఆయనకు మద్దతు తెలుపుతూ పాల్గొన్నటువంటి అభిమానుల నడుమ ఎంతో ఉత్సాహంగా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.తన బాబాయ్ బాలకృష్ణ నారా లోకేష్ ఇతర తెలుగుదేశం నేతల నడుమ ఈయన కూడా సరదాగా మాట్లాడుతు పాదయాత్రలో పాల్గొన్నారు.

Tarakaratna:చివరి వరకు నవ్వుతూ సరదాగా గడిపిన తారకరత్న..
ఇలా ఎంతో ఉత్సాహంతో పాదయాత్రలో పాల్గొన్నటువంటి ఈయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈయనకు స్ట్రోక్ వచ్చిందని తెలియగానే వెంటనే సమీప ఆసుపత్రికి తారకరత్నను తరలించారు. ఇలా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక తారకరత్న లేరనే వార్త నందమూరి కుటుంబ సభ్యులకు మింగుడు పడటం లేదు.




























