బాలనటుడిగా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు తరుణ్ ఆ తరువాత హీరోగా అద్భుతమైన సినిమాల్లో నటించి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. ఇలా హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న తరువాత తను నటించిన సినిమాలన్నీ వరుస ఫ్లాప్ కావడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఈ క్రమంలోనే ఆహాలో స్ట్రీమ్ అయిన మలయాళ అనువాద చిత్రం అనుకోని అతిథి సినిమా కోసం నటుడు ఫహద్ ఫాజిల్ కి డబ్బింగ్ చెప్పడంతో మరోసారి ఫేమస్ అయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా తరుణ్ గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోసారి తరుణ్ మేకప్ వేసుకుని వెండితెరపై సందడి చేయనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారీ వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాలో కథ మొత్తాన్ని కీలక మలుపు తిరిగే పాత్ర ఉందని, అందులో నటించడానికి హీరో తరుణ్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఈ విషయం గురించి చిత్ర బృందం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఈ కథను విన్న తరుణ్ ఈ పాత్రలో చేయడానికి సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.































