Tarzon Lakshmi Narayana : తెలుగులో విలన్ గా అనేక సినిమాల్లో నటించిన లక్ష్మి నారాయణ. విలన్ పక్కన ఎక్కువ పాత్రల్లో కనిపించారు. తెలుగు, తమిళం, హిందీ అంటూ పలు భాషలలో నటించాడు. హైదరాబాద్ కి చెందిన లక్ష్మి నారాయణ కు మొదట సినిమాలంటే ఏమాత్రం తెలియక ముందే షూటింగ్ కి వచ్చి తెలియక ఒకరి ముక్కు పగులగొట్టాడట. ఇక ఆర్జీవి సినిమాల్లో ఎక్కువగా నటించిన లక్ష్మీనారాయణ ఆ తరువాత ఆయన శిష్యుల సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుని తెలుగు తమిళం లో దాదాపు అందరు డైరెక్టర్లతోనూ పనిచేసారు.

వర్మ చెప్పారని ఒకరినీ బెదిరించాను…
రామ్ గోపాల్ వర్మ తో ఉన్న సన్నిహిత్యంతో ఇక ‘గాయం’ సినిమాతో అనుబంధం మరింత బలపడి ఆయన సినిమాల్లో ఖచ్చితంగా నటించేవాడు లక్ష్మి నారాయణ. ఇక వర్మ లక్ష్మి నారాయణ కు ఈ పేరు నీకు సెట్ కాలేదని చెప్పి ‘టార్జాన్’ అనే పేరును పెట్టాడు. అలా ఇక అందరూ టార్జాన్ అనే పిలిచేవారంటూ లక్ష్మి నారాయణ చెప్పారు. ఇక వర్మ ‘దౌడ్’ సినిమా షూటింగ్ ముంబై లో చేస్తున్నపుడు నన్ను పిలిచి పై అంతస్థుల్లో ఒక థియేటర్ ఓనర్ ఉన్నాడు అతన్ని బెదిరించమని అడిగితే వెళ్లి హిందీ లో బెదిరించేసరికి వెనుక నుండి చేయి తీసే సరికి గన్ అనుకుని బయపడి దండం పెట్టేసాడు.

ఇదంతా సరదాగా చేసినదే నేను నిజంగా సెటిల్మెంట్స్ ఏమి చేయను అంటూ వివరించారు. ఇక మరోసారి తనికెళ్ళ భరణి ఫోన్ చేసి చెన్నై రమ్మని ఒకతన్ని భయపెట్టాలి అని అడిగితే వెళ్లి ఏంటి ఎవరు అని ఆలోచించకుండా వెళ్లి ఉదయానికి వాళ్ళ డబ్బు ఇచ్చేయాలని చెప్పాను. నువ్వెవరు అని అడిగితే పొద్దునకు నీ జాగా ఉండదు అని చెప్పాను అంతే ఇక వెంటనే వాళ్లకు డబ్బు ఇచ్చేస్తానని ఫోన్ చేసి ఉదయానికి డబ్బు ఇచ్చేసాడు అంటూ అయన అనుభవాలను పంచుకున్నారు.



























