TDP leader A.V. Subbareddy : భూమా కుటుంబానికి రాయలసీమ రాజకీయాలలో మంచి గుర్తింపు ఉంది. దురదృష్టవశాత్తు శోభా నాగిరెడ్డి అలాగే భూమా నాగిరెడ్డి గారి అకాల మరణం వారి కుటుంబాన్ని కుదిపేసింది. భూమా అఖిల ప్రియ పెద్ధ అమ్మయిగా తానే కుటుంబ బాధ్యతలు తీసుకోగా చెల్లి మౌనిక రెడ్డి అక్కకు రాజకీయంగా తోడుగా ఉంది. అయితే మొదటి నుండి భూమా నాగిరెడ్డికి రాజకీయాల్లో తోడుగా నిలిచిన ఏవి సుబ్బారెడ్డి ఇపుడు భూమా అఖిల ప్రియతో కలిసి లేరు. తాజాగా ఇరు గ్రూపుల్లో ఫ్యాక్షన్ తగాదాలు మొదలయ్యాయి. ఇరు వర్గాలు టీడీపీలోనే కొనసాగుతున్నా కూడా రెండు వర్గాలుగా నియోజకవర్గంలో ఆధిపథ్య పోరు కోసం గొడవ పడుతున్నారు.

అఖిల ప్రియ చున్నీ లాగారా…
యువగళం పేరుతో పాదయాత్ర చేసిన లోకేష్ పాదయాత్రలో భాగంగా నంద్యాల, ఆళ్లగడ్డ వచ్చినపుడు అఖిల ప్రియ వర్గం, ఏవి సుబ్బారెడ్డి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గొడవకు కారణం అఖిల ప్రియ చున్నీని ఏవి సుబ్బారెడ్డి లాగారని, దుర్భాషలాడారని అఖిల ప్రియ ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసారు. అయితే ఈ విషయం గురించి అఖిల ప్రియ మామ ఏవి సుబ్బారెడ్డి గారు క్లారిటీ ఇస్తూ ఆమె నామీద అపద్ధపు ఆరోపణలను చేస్తోంది అంటూ చెప్పారు. కనీసం నమ్మదగిన విధంగా కూడా అపద్దాలను చెప్పడం లేదని విమర్శించారు.

ఆళ్లగడ్డ లో భూమా అఖిల ప్రియ మాటలను నమ్మే వాళ్ళు ఎవరూ లేరని, భూమా నాగిరెడ్డి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నానని చెబుతాను అలాగే నాగిరెడ్డి కూడా తాను రాజకీయంగా ఎదగడానికి నేను కారణం అని చెబుతాడు. ఈ విషయాలేవీ తెలియకుండా ఇపుడు రాజకీయాల్లోకి వచ్చి నేను నాగిరెడ్డి ని చంపాను అంటూ మాట్లాడుతోంది. ఆమె మాటలను నమ్మడం జనాలు ఏనాడో మానేశారు. నెక్స్ట్ టికెట్ ఇస్తే ఎక్కడైనా టీడీపీ గెలుస్తుందేమో కానీ ఆళ్లగడ్డ లో అఖిల ప్రియ నిలబడితే ఖచ్చితంగా ఓడిపోతుంది. ఆమె సొంత కుటుంబమే ఆమెకు సపోర్ట్ చేయడం లేదు అంటూ ఏవి సుబ్బారెడ్డి తెలిపారు.


































