Teegala Krishna Reddy : ప్రతిపక్షాలు చంద్రబాబును విమర్శించాలంటే వెన్ను పోటు అనే అంశాన్ని తెరమీదకు తేస్తారు. మామ కు వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నావ్ అంటూ మాట్లాడుతారు. అయితే అందులో నిజానిజాలు అప్పటి నాయకులకు తప్పు నేటి తరానికి ఎవరికీ స్పష్టంగా తెలియదు. ఎన్టీఆర్ పార్టీని లక్ష్మి పార్వతి చేతిలో పెడుతున్న సమయంలో చంద్రబాబు టీడీపీ పార్టీని కాపాడాడు అంటూ మరో వెర్షన్ మనకు వినిపిస్తుంది. అయితే అసలు ఏం జరిగింది అనే విషయాల మీద అప్పటి తెలుగుదేశం నేత తీగల కృష్ణ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు.

ఆ రోజు వైశ్రాయ్ హోటల్ లో జరిగిందేమిటి…
వైశ్రాయ్ హోటల్ లో ఎన్టీఆర్ మీద చెప్పులతో జరిగిన దాడి, పార్టీని ఏ పరిస్థితులలో చంద్రబాబు నాయుడు పార్టీని తీసుకోవాల్సి వచ్చిందో తీగల కృష్ణ రెడ్డి వివరించారు. ఎన్టీఆర్ గారు లక్ష్మి పార్వతిని పెళ్లి చేసుకోవడం ఆయన చేసిన పెద్ద తప్పు అంటూ చెప్పారు. ఆమె ఒక అభిమానిగా ఆయన దగ్గరకు తన భర్త, తన కొడుకుతో వచ్చి చివరకు ఆయననే పెళ్లి చేసుకుంది. ఇక ఆపైన పార్టీ మీద పెత్తనం చేయాలని చూసింది లక్ష్మి పార్వతి. ఆమె రోశయ్య తదితర కాంగ్రెస్ వారితో ఆల్రెడీ మంతనాలు జరుపుతున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు అందరు చంద్రబాబును పార్టీ గురించి ఎన్టీఆర్ తో మాట్లాడండి లేదంటే అశోక్ గజపతి రాజును లీడర్ గా ఎన్నుకొంటాం అనడంతో చంద్రబాబు ఆయనను కలిసాడు. అప్పుడు నేను ఆయన వెంట ఉన్నాను.

నా కారులోనే ఆయనను తీసుకెళ్ళాను ఎన్టీఆర్ వద్దకు. నేను ఉండగానే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ తో పార్టీ గురించి, ఎమ్మెల్యేల గురించి ఆలోచించండి అంటే పరుష పదజాలంతో బూతులు తిట్టారు ఎన్టీఆర్. ఇక వినడని అర్థమై అక్కడి నుండి వచ్చేసాం ఆసమయంలో ఎమ్మెల్యేలు అలా చేసారు. అది చంద్రబాబు చేయించింది కాదు. ఆ తరువాత ఎమ్మెల్యేలందరూ కలిసి చంద్రబాబు ను లీడర్ గా ఎన్నుకోవడం అన్నీ జరిగిపోయాయి. ఆ నాడు చంద్రబాబు లేకపోతే టీడీపీ ఎపుడో కాంగ్రెస్ చేతిలోకి వెళ్లిపోయేది అంటూ తెలిపారు.





























