కరోనా పలానా వయస్సు ఉన్న వారికి మాత్రమే వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, వైద్యులు చెబుతున్న మాటలు నిజమవుతున్నాయి. ఒక పక్క కరోనా కాంటాక్ట్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లాలో 23 రోజుల పసికందును కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. రెండు రోజుల క్రితమే ఈ చిన్నారి తండ్రి మరియు నానమ్మకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ వెంకట్రావ్ తెలిపారు. అయితే మెరుగైన చికిత్స కోసం ఆ చిన్నారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఢిల్లీ మర్కజ్ కి వెళ్లివచ్చిన వారి నుంచి ఈ ముగ్గురికి వైరస్ అంటుకున్నట్టు తెలిపారు. ఈ ఘటనతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నిన్నటి వరకు జిల్లాలో 7 కరోనా పాజిటివ్ కేసులు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య పెరగడంతో ఆందోళన చెందుతున్నారు. కాగా ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా బాధితుల ఇంటి చుట్టూ పక్కల 3 కిలోమీటర్ల వరకు కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ప్రజలు ఎవరు అవసరం అయితే తప్ప బయటకి రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. భాదితుల ఇంటి వద్ద శానిటైజ్ చేస్తున్నారు. ఇంకా ఆప్రాంతంలో వీరి నుంచి ఇంకా ఎంతమందికి ఈ వ్యాధి సోకింది అనే విషయంపై నిఘా పెట్టారు.




























