తెలంగాణ మంత్రి వర్గం సమావేశం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్నా ఈ మంత్రి వర్గ సమావేశం ప్రగతి భవన్ లో జరుగుతుంది. ఈ క్రమంలో మంత్రి వర్గ సమావేశానికి మంత్రులందరూ హాజరయ్యారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ ఫైల్ కు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యోగుల వేతన సవరణపై చర్చ జరపనున్నట్టు సమాచారం. మరోవైపు రాష్ట్రంలో కరోనా పరిస్థితి, లాక్ డౌన్ అమలు, రేపటితో లాక్ డౌన్ గడువు ముగుస్తున్న నేపధ్యంలో ఇకపై లాక్ డౌన్ పెట్టాలా? వద్దా అనే అంశంపై కూడా చర్చ జరగనున్నట్టు తెలుస్తుంది. మరోవైపు కరోనా ఉదృతి నేపద్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై ఎలాంటి ప్రభావం చూపింది. తీసుకోవాల్సిన చర్యలేంటి తదితర అంశాలపై సమావేశంలో చర్చించి మంత్రి వర్గం తగిన నిర్ణయాలు తీసుకోనున్నది.


































