కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్న నేపధ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు నుంచి మొదలు మే 1 వరకూ నైట్ కర్ఫ్యూ విధించనున్నారు. రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండడంతో ప్రభుత్వం పరిస్థితి సమీక్షించి కీలక నిర్ణయం తీసుకుంది.

కేంద్రం ఇప్పటికే కఠిన ఆంక్షలు అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ ఆంక్షలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. అయితే కర్ఫ్యూ నుంచి అత్యవసర సేవలకు మినహాయింపు ఇవ్వనున్నారు. ఈ నేపధ్యంలో నైట్ కర్ఫ్యూ తో బార్లు, పబ్బులు, రెస్టారెంట్లు మూతపడనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here