తెలంగాణలో డిసెంబర్ 2 నుంచి విద్యాసంస్థలు బంద్ అనే ప్రచారం సాగుతోంది. దీనికి కారణం ప్రపంచవ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు . కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రతీ ఒక్కరిని భయపెడుతోంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి పాఠశాలలు బంద్ అనే వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. అయితే దీనిని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి స్పందించారు.

ఈ ప్రచారంలో నిజం లేదని..అది అంతా ఫేక్ అంటూ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి అయితే అలాంటి ప్రతిపాదన లేదని.. కోవిడ్ కేసులు నమోదవుతున్నా.. అవి సాధారణ కేసులే అని.. అవి ఒమిక్రాన్ వేరియంట్ కాదంటూ చెప్పారు.కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే విద్యాసంస్థలు కొనసాగించాలిన ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి గుర్తుచేశారు.
ఇలా విద్యాసంస్థలపై తప్పుడు ప్రచారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మవద్దవని ఆమె కోరారు. పిల్లల భద్రత, క్షేమం గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరోనా వ్యాప్తి కట్టడికి విద్యాంస్థల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు.
అంతే కాకుండా.. వైద్యుల సూచిస్తున్న నిబంధలను కచ్చితంంగా పాటించాలన్నారు. విద్యాసంస్థలపై వస్తున్న తప్పుడు కథనాలను, వార్తలను నమ్మొద్దంటూ తెలియజేశారు.































