ఉద్యోగ నోటీఫికేషన్లకు కోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ముందుగా కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేడర్లను ఖరారు చేసింది. ఉద్యోగాలను జిల్లా, జోనల్, మల్టీజోనల్ కేడర్లగా విభజించింది. తీవ్ర కసరత్తు అనంతరం ఉద్యోగాల క్యాటగిరీలను ఫైనల్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఆఫీస్ సబార్డినేట్ నుంచి జూనియర్ అసిస్టెంట్ వరకు జిల్లా కేడర్ కింద చేర్చగా.. సీనియర్ అసిస్టెంట్, ఆ స్ధాయి పోస్టులను జోనల్ కేడర్‌లొ, జిల్లాస్థాయి అధికారులు, ఇతర పోస్టులను మల్టీజోనల్ కేడర్‌లో చేర్చించింది.



























