తెలంగాణలో కరోనా ఉదృతి తగ్గుతున్న నేపధ్యంలో లాక్ డౌన్ మరోసారి పోడిగించావద్దని భావిస్తుంది తెలంగాణ సర్కార్. ప్రస్తుతం తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కరోనా కేసుల పెరుగుతున్న సమయంలో రాష్ట్రంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ లాక్ డౌన్ ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

పాజిటివ్ కేసులు తగ్గుతుండటంతో ఇకపై పగటిపూట పూర్తిగా లాక్ డౌన్ ఎత్తివేసి రాత్రి పూట కర్ఫ్యూ పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. మే 12 నుంచి 30 వరకు లాక్‌డౌన్ విధించిన ప్రభుత్వం కేవలం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే సడలింపు ఇచ్చింది. గత నెల మే 31 నుంచి సడలింపులో మార్పులు చేసి మధ్యాహ్నం 2 వరకు పొడిగించింది. అయితే ప్రస్తుత లాక్ డౌన్ గడువు గడువు బుధవారంతో ముగుస్తుండటంతో తాజగా పగటిపూట లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇకపై లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేసి రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని భావిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. వ్యాపారాలతో పాటూ మెట్రో, బస్సులకు సాయంత్రం 7 వరకు అనుమతీ ఇవ్వనున్నట్టు సమాచారం.

































