లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి వందల సంఖ్యలో ప్రజలకు తన వంతు సహాయం చేసి ఇప్పటికీ ఆ సహాయాలను కొనసాగిస్తూ వార్తల్లో నిలిచారు సోనూసూద్. తన సహాయాల ద్వారా సోనూసూద్ కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. పెద్దపెద్ద రాజకీయ నాయకులు, కోట్లలో పారితోషికం తీసుకునే హీరోలు సైతం సాయం చేయడానికి వెనుకడుగు వేస్తుంటే సోనూసూద్ మాత్రం వరుస సహాయాలతో కలియుగ కర్ణుడిగా పేరు తెచ్చుకున్నాడు.

పేద ప్రజలకు, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం కోసం ఆస్తులను సైతం తాకట్టు పెట్టిన సోనూసూద్ కు తెలంగాణ వాసులు గుడి కడుతున్నారు. సినిమాల్లో కెరీర్ ను మొదలుపెట్టినప్పటి నుంచి విలన్ పాత్రల్లో ఎక్కువగా నటిస్తూ మెప్పిస్తున్న సోనూసూద్ నిజజీవితంలో మాత్రం తాను హీరోనని ప్రూవ్ చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లాకు చెందిన దుబ్బ తండా ప్రాంతంలో సోనుసూద్ కు అక్కడి ప్రజలు గుడి కట్టారు.

స్థానికులు సోనూసూద్ కు కోవెల కట్టడం గురించి స్పందిస్తూ ఎంతో మంది ప్రజలకు సహాయం చేస్తున్న సోనూసూద్ సేవా గుణాన్ని చూసి ఆయనకు గుడి కట్టాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. సోనూసూద్ కు గుడి కట్టే అవకాశం తమకు రావడం అదృష్టంగా భావిస్తున్నామని ఆ గ్రామ ప్రజలు చెబుతున్నారు. సోనూసూద్ గుడికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరోవైపు ఇన్ని రోజులు విలన్ పాత్రలతో మెప్పించిన సోనూసూద్ ఇకపై పాజిటివ్ క్యారెక్టర్ తో కూడిన పాత్రలతోనే నటిస్తానని తెలిపారు. అభిమానులు తనను విలన్ పాత్రల్లో చూడటానికి ఇష్టపడని నేపథ్యంలో సోనూసూద్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here