బాప్ రే.. సింహంతో దగ్గర నుంచి ఫొటో దిగాలనుకున్నాడు.. అతడు ఏం చేశాడో చూడండి..

0
123

కొన్ని సందర్భాల్లో ఫుల్ తాగి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించే మహానుభావులను మనం చూసి ఉంటాం. కానీ ఇక్కడ ఓ ఆకతాయి మద్యం సేవించి.. జూ పార్కులోని సింహం ఎన్‌క్లోజర్‌లో దూకే ధైర్యం చేశాడు. చివరకు ఏమైందో తెలుసా.. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఎవరైనా సింహాలను జూ పార్క్ లో బయట నుంచి చూడాలంటేనే వణుకు పుడుతుంది.

అలాంటిది ఇక దగ్గరకు వెళ్లడమా.. ఇక అంతే సంగతులు. హైదరాబాద్ జవహర్‌లాల్ నెహ్రూ జూపార్క్‌లో ఓ యువకుడు సింహం ఎన్‌క్లోజర్‌ దగ్గర వరకు వెళ్లాడు. ఇక అక్కడకు వెళ్లి సింహంతో ఆట ఆడుకునే ప్రయత్నం చేశాడు. అది ఆకలితో ఉంది. గాండ్రిస్తూ.. బయట ఉన్న వాళ్లకు కూడా భయాన్ని తెప్పిస్తోంది. ఇక కింద నుంచి చూస్తున్న ఆ సింహం కిందకు ఎప్పుడు వస్తాడా అని ఎదరు చూసింది.

ఇక బయట నుంచి చూసే జనం అతడి సాహసాన్ని చూస్తూ.. ఫొటోలో, వీడియోల తీస్తూ ఉండిపోయారు. అక్కడికి వెళ్లొద్దూ అంటూ అరవడం కూడా మొదలు పెట్టాడు. అస్సలు అతడు వింటేగా.. అలానే ముందుకు వెళ్లాడు. ఆ ఆకతాయి సింహంతో సింగల్‌గా ఫోజు ఇవ్వాలనుకున్నాడు. ఇలా సింహం ఉండే గుహ బండరాళ్లపై కూర్చున్నాడు.

చివరకు జూ పార్క్ నిర్వాహకులకు తెలవడంతో హుటాహుటిన వచ్చి.. అతడి కాలర్ పట్టుకొని.. కొట్టుకుంటూ బయటకు తీసుకొచ్చారు. దీంతో ఈ ఘటనను చూస్తున్న సందర్శకులకు గుండె ఆగేంత పని అయింది. అతడిని అక్కడ నుంచి తీసుకెళ్లడంతో ఎవరి దారిలో వారు వెళ్లిపోయారు. అతడి మద్యం సేవించి ఉన్నాడని నిర్వాహకులు తెలిపారు. అతడిని జూ పార్క్ అధికారులు బహుదూర్‌పూర పోలీసులకు అప్పగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here