తెలంగాణ రాష్ట్రంలో సరికొత్తగా నిర్మించనున్న సచివాలయ నిర్మాణానికి రాజస్థాన్ నుంచి తెప్పించిన రాళ్ళను వినియోగించనున్నారు. పార్లమెంట్ లో ఉన్న ఫౌంటెయిన్ల మాదిరిగా ఇక్కడ కుడా ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపధ్యంలో ఈ రాళ్ళను రాజస్థాన్లోని ధోల్పూర్ రాయలను తెప్పించాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు.

కాగా.. భవనం మధ్య భాగంలో భీజ్ రంగు రాతి పలకలను ఉపయోగించేలా నమూనాలను రూపొందించారు. అయితే రాజస్థాన్ లోని యంత్రాలతో చెక్కిన రాతి పలకలను కాకుండా మనుషులతో చెక్కించిన వాటిని తీసుకురావాలని సిఎం కెసిఆర్ అధికారులకు సూచించారు.