“కళ్యాణ ప్రాప్తిరస్తు” చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమై.. సినిమాలలో అవకాశాలు రాకపోవడంతో యాంకర్ గా సెటిలైన నటి సుమ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.! అది బుల్లితెర ప్రోగ్రామైనా.. వెండితెర సినిమా ఫంక్షనైనా.. సుమ కనిపిస్తే చాలు అక్కడి వాతావరణం అంతా సందడే సందడి. ప్రత్యేకంగా సుమ టాకింగ్ పవర్ గురించి చెప్పవల్సిన అవసరం లేదు. ఎంతటి గొప్ప వ్యక్తినైనా సరే తన మాటల చమత్కారంతో ఇట్టే బుట్టలో పడేస్తుంటుంది సుమ. అలాగే సందర్భానుసారంగా సమయస్ఫూర్తితో పంచులేయడంలో సుమను మించినవాళ్ళు లేరనే చెప్పవచ్చు.

ఇక అసలు విషయానికి వస్తే.. ఆమె వ్యక్తిగత జీవితంపై ఈమధ్య సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. సుమ భర్త రాజీవ్ కనకాలతో గొడవలు పడుతుందని, ఇప్పుడు వీళ్ళిద్దరూ విడి విడిగానే ఉంటున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ రూమర్స్ పై ఇంతవరకూ భార్యాభర్తలు స్పందించలేదు. ఈ నేపథ్యంలో సుమ షేర్ చేసిన వీడియో, దానిపై ఆమె రాసిన సందేశం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చని చెట్ల మధ్య పరుగులెడుతూ ఆ వీడియోలో కనిపించిన సుమ..

చెట్లు, పక్షులు, ప్రకృతి వీటిని చూసి మనం చాలా నేర్చుకోవాలంటూ సందేశాన్ని అందించింది. ఈ ఆకుపచ్చ, ఎరుపు వర్ణాలు కంటికి, మనస్సుకూ చాలా ప్రశాంతతనిస్తున్నాయి. ఆనందమనేది జీవితంలో నిరంతర ప్రక్రియ అని, అది ఏ ఒక్క సమయానికో పరిమితం కాకూడదని, ఆ ఆనందాన్ని మనమే సృష్టించుకోవాలని సుమ సందేశాన్నివ్వడంతో ఈ వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది.
ఎన్టిఆర్ మాట లెక్కచేయని అలనాటి అందాల హీరొయిన్ వాణిశ్రీ పరిస్థితి ఎలా మారిపాయిందో