మాజీ ప్రధాని మన్మోహన్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఇవాళ సెలవు ప్రకటించారు. ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అదనంగా, సీఎస్ శాంతి కుమారి వారం రోజుల పాటు సంతాప దినం పాటించాలని ఆదేశించారు. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం కూడా సెలవు ప్రకటించింది. మరో వైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని కోరుతున్నారు కొందరు నెటిజన్లు.































