Thammareddy Bharadwaja : సీనియర్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ గారు ప్రస్తుతం సినిమాలను చేయకపోయినా సినిమా ఇండస్ట్రీ గురించి అలాగే ప్రస్తుతం ఉన్న సినిమా పోకడలు అలాగే పెరిగిన సినిమా బడ్జెట్ వంటి విషయాల మీద తన మార్క్ కామెంట్స్ చేస్తుంటారు. చిన్న సినిమాలను బతకనీయండి అంటూ పెద్ధ ప్రొడ్యూసర్లకు చురకలు వేసే భరద్వాజ గారు తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా గురించి హాట్ కామెంట్స్ చేశారు.

ఆస్కార్ కోసం కోట్లు ఖర్చు…
ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయంగా ఎలా సత్తా చాటుతోందో అందరికీ తెలుసు. ప్రస్తుతం ఆస్కార్ బరిలో నిలిచి ఇంటర్నేషనల్ వేదిక మీద ఆర్ఆర్ఆర్ అదరగొడుతోంది అలాగే ఇండియన్ సినిమా ఖ్యాతిని పెంచుతోంది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాను ఇంటర్నేషనల్ లెవెల్ లో ప్రమోట్ చేయడానికి అ సినిమా టీం దాదాపు 80 కోట్లు ఖర్చు పెట్టారంటూ భరద్వాజ కామెంట్స్ చేసారు. ఆ డబ్బుతో ఇక్కడ తెలుగులో ఒక సినిమా బాగా తీయొచ్చు అంటూ అయినా అది వాళ్ళ ఇష్టం, నేను ఎవరినీ తప్పుబట్టడం లేదు అంటూ మాట్లాడారు తమ్మారెడ్డి భరద్వాజ.

సినిమా బడ్జెట్ విషయంలో ప్రస్తుతం ఉన్న ప్రొడ్యూసర్లను విమర్శిస్తూ పై విమర్శలను చేసారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ వద్ద లాబీయింగ్ చేస్తున్నారు అనే విమర్శలు వినిపించినా అందులో తప్పేముంది సినిమాను ప్రమోట్ చేసుకుంటేనే కాదా అక్కడిదాకా వెళ్ళగలదు అంటూ మరో వాదన వినిపించింది. ఏది ఏమైనా మన తెలుగు సినిమా ప్రపంచ ప్రేక్షకుల ముందుకు వెళ్లడం మాత్రం మనకు గర్వకారణమే.


































