Thammareddy Bharadwaja : సీనియర్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ అయిన తమ్మారెడ్డి సినిమా ఇండస్ట్రీ లోని సమకాలిన అంశాలమీద ఆయన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు ఇంటర్వ్యూ ల్లో పంచుకుంటూ ఉన్నారు. ఇక తాజాగా హాట్ టాపిక్ అయిన సినిమా షూటింగ్ బంద్ ల వివాదం గురించి జయసుధ అవార్డుల విషయం గురించి మాట్లాడారు. ఇక అలాగే ఇప్పటి సినిమాలు, హీరోల పోకడలగురించి ఘాటుగానే స్పందించారు తమ్మారెడ్డి.

ఇప్పటి హీరోల్లో బన్నీ ఒక్కడే బెటర్…
సినిమా టికెట్ ధరలు పెంచేసి ప్రేక్షకుడిని థియేటర్కు రమ్మంటే ఎలా. ప్రొడక్షన్ ఖర్చు తగ్గించుకుని బడ్జెట్ అదుపులో పెట్టాల్సిన భాద్యత నిర్మాతలదే అంటూ చెప్పారు. ఇంతకు ముందు సినిమాలు డైరెక్టర్ల, నిర్మాతల సినిమాలుగా ఉండేవి.. కానీ ఇప్పడు సినిమాలు హీరోల సినిమాలుగా ఉన్నాయి. ఇంతకు ముందు అభిరుచి గల ప్రొడ్యూసర్లు ఉండేవారు. ఇపుడు బిజినెస్ అంతే. సినిమా అంతా హీరోల అనుగుణంగా పోతోంది. అందుకే హీరోల విభిన్నత సినిమాలలో కనిపించడం లేదు. ఇప్పుడు తరం హీరోలలో అల్లు అర్జున్ మాత్రమే సినిమా సినిమాకి కొంచెం వెరీయేషన్ చూపిస్తున్నాడు.

మిగతా హీరోలందరూ మూస ధోరణిలో నాలుగు పాటలు రెండు ఫైట్లు అన్నట్లుగా పోతున్నారు. కొత్తగా ఏం చేయడం లేదు. ఎన్టీఆర్ లాంటి మంచి ఆర్టిస్టులు ఉన్నా మూస కథలను చేస్తున్నారు అంటూ చెప్పారు భరద్వాజ. ఇక సినిమాల్లో ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మార్పులు రావాలని చెప్పారు. ట్రెండ్ తెలిస్తే అందరూ సినిమాలు హిట్ కొడతారని ఆ ట్రెండ్ తెలుసుకోవడం కష్టమని చెప్పారు. ఇప్పుడున్న దర్శకులు, నిర్మాతలు ఏసీ గదుల్లో కూర్చొని ఏసీ కార్లలో తిరిగితే బయట సమాజంలో జరిగే విషయాలు ఎలా తెలుస్తాయి అంటూ చెప్పారు. ఇక జయసుధ విషయంలో కామెంట్స్ చేసారు. కొనుక్కో, అవార్డుల గురించి ఎందుకు ఆలోచిస్తావ్ అంటూ జయసుధ గురించి మాట్లాడాడు.



























