Tharun : మాటల మాంత్రికుడి మొదటి సినిమా, సినిమాలోని ప్రతి పాట మంచి హిట్ అయితే హీరోయిన్ ఏడుస్తూ పాడే ఏ చోటా ఉన్నా… క్లైమాక్స్ పాటకి మాత్రం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇక ఈ సినిమాలోని ప్రతి సీన్ కూడా ఎక్కడా బోర్ కొట్టించవు. ఇక సునీల్, తరుణ్ కాలేజీ కామెడీ, ఎంఎస్ నారాయణ అన్నవరం కామెడీ మరచిపోలేము. ఈ సినిమా వచ్చి ఇప్పటికి ఇరవై ఏళ్ళు అయినా మరో ఇరవై ఏళ్ళు దాటినా ఈ సినిమా బోర్ కొట్టదు. ఈ సినిమా లో డైలాగ్ లాగా అమ్మ, అవకాయ్, అంజలి… ఈ సినిమా అస్సలు బోర్ కొట్టవు . మాటల మాంత్రికుడి డైలాగులు, తరుణ్, శ్రీయ, ప్రకాష్ రాజ్, సునీల్ నటన సినిమాను మరో రేంజ్ కి తీసుకెల్లాయి. అలాంటి ఈ సినిమా ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్బంగా వేడుక నిర్వహించారు ఈ చిత్ర యూనిట్. ఏఎంబి థియేటర్ లో స్పెషల్ షో వేసి చిత్ర యూనిట్ మరోసారి సినిమా చూసారు.

నేనే ఫస్ట్ హీరో…
ఇక మాటల మాంత్రికుడికి దర్శకుడిగా మొదటి సినిమా ‘నువ్వే నువ్వే’. ప్రస్తుతం అగ్ర హీరోలందరితో సినిమాలు చేసి హిట్లందుకుంటున్న త్రివిక్రమ్ మార్కెట్ బాగా పెరిగింది. రీసెంట్ గా వచ్చిన ‘అలా వైకుంఠ పురములో’ సినిమా నార్త్ లో కూడా ఉపేసింది. ఇక ఈ దర్శకుడు ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్ళు గడిచిపోయాయి. తన మొదటి సినిమా నువ్వే నువ్వేలో డైలాగులకు కామెడీ సీన్స్ ఇప్పటికీ అలరిస్తున్నాయి. ఇక ఈ సినిమా హీరో అయిన తరుణ్ సినిమా ఇరవై ఏళ్ల వేడుకలో మాట్లాడుతూ త్రివిక్రమ్ ఎపుడు ఎంత మంది టాప్ హీరోస్ తో చేసినా తన మొధాటి హీరో నేనే అంటూ చెప్పారు. స్రవంతి రవి కిషోర్ గారి నిర్మాణం లో మూడు సినిమాలను చేశాను.

హీరోగా నా మొదటి సినిమా ‘నువ్వే కావాలి’ రవికిషోర్ గారిదే, ఇక ఆ సినిమాకు మాటలు త్రివిక్రమ్ గారే రాసారు. ఇక నువ్వే నువ్వే మొదటి డైరెక్షన్. రవి కిషోర్ గారి మూడో సినిమా ‘ఎలా చెప్పను’, ఈ మూడు హిట్ సినిమాలే. అలా మంచి బ్యానర్ లో మంచి దర్శకుడు పని చేయడం నా అదృష్టం. ఇప్పటికీ బోర్ కొడితే ఎపుడైనా యూట్యూబ్ లో ఈ సినిమా సీన్స్ చూస్తాను. ప్రకాష్ రాజ్ గారితో నటించిన మొదటి సినిమా గొప్ప నటినటులతో నటించాను. ఇలాంటి సినిమా మళ్ళీ చేయమని చాలా మంది నన్ను అడుగుతుంటారు. అమ్మ.. అవకాయ్.. అంజలి.. నువ్వేనువ్వే సినిమా ఎప్పటికీ మరువలేము అంటూ చెప్పారు తరుణ్.
































