ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబం కలిగిన జియోనా చనా (76) కన్నుమూశారు. మిజోరానికి చెందిన జియోనా చనాకు 38 మంది భార్యలు, 89 మంది పిల్లల సంతానంతో ప్రపంచంలో అతిపెద్ద కుటుంబం ఇతని. అయితే ఆదివారం జియోనా చనా మృతి చెందినట్లు ఆ రాష్ట్ర సీఎం జోరంతాంగ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

జియోనా కుటుంబం వల్లే స్వగ్రామం బక్తాంగ్ త్లాంగ్‌నుమ్ పర్యాటకపరంగా ప్రధాన ఆకర్షణగా నిలిచిందని ఈ క్రమంలో జోరంతాంగ తెలిపారు. ఈ కుటుంబాన్ని తిలకించేందుకు దేశ విదేశాల పర్యాటకులు పెద్దసంఖ్యలో ఇక్కడికి వచ్చేవారని పేర్కొన్నారు.



























