వివాహం జరిగే సమయంలో భోజనాల దగ్గర నంచి మడపంపై వధూవరులు వెళ్లి కూర్చునే వరకు జాగ్రత్తగా ఉండాలని వధూవరుల తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకుంటారు. పెళ్లి పీటలపైకి వధువును లేదా వరుడిని తీసుకొని వెళ్లే సమయంలో మేళం వాయించే వాళ్లు అయినా.. అక్కడ మ్యూజిక్ ప్లే చేసే వారు ఆ సందర్భాన్ని బట్టి పాటలను ప్లే చేస్తూ ఉంటారు.

ఒక వేళ మనకు నచ్చిన సాంగ్ ఆ సమయంలో ప్లే చేయాలి అంటే వాళ్లు కచ్చితంగా వింటారు. కానీ ఇక్కడ వాళ్లు వధువు చెప్పిన సాంగ్ ప్లే చేయలేదని ఎక్కడలేని కోపాన్ని తెచ్చుకుంది ఈ నవ వధువు. ఇంతకు చివరకు ఏం జరిగిందంటే.. పూర్తి వివరాలను తెలుసుకుందాం. సోషల్ మీడియాలో ఇప్పడు ఈ వీడియో వైరల్ గా మారింది. పెళ్లి చేసుకునేందుకు పెళ్లి మండపానికి వెళ్తున్న సమయంలో వధువు చెప్పిన సాంగ్ వాళ్లు వేయలేదు. దీంతో ఆమెకు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది.
ఏంటి.. నేను చెప్పింది ఎందుకు చేయలేదు.. అంటూ కస్సబుస్సయింది. పక్కనే ఉన్న బంధువులు కంగారుగా దగ్గరకు వచ్చి ఏంటి.. ఏం జరిగిందంటూ.. అడిగారు. ఉన్న విషయాన్ని వాళ్లకు చెప్పింది. ఇంత చిన్న విషయానికి అంత పెద్ద కోపమా.. అంటూ వాళ్లు ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అవును.. పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి జరుగుతుంది. ఆ సమయం అనేది ఎప్పటికీ మర్చిపోలేనిది.. అలాంటి సమయంలో మనకు కావాల్సినవి సాధించుకోవాలని ఉంటుంది.
అలాంటిది చిన్ని పని కూడా చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పని చేయకపోవడంతో ఆమె పెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకునే వరకు వెళ్లిందంటే మనం అర్థం చేసుకోవాలి.. ఆమె ఎంతగా దానికి ఫీల్ అయి ఉంటుందో. చిరవకు ఆమెకు బంధువులు నచ్చజెప్పి వివాహం జరిపించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ నవ వధువుకే సపోర్టుగా నిలిచారు.
































