లారీని బస్సు ఢీకొనడంతో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. వెదురుగట్టలో వివాహా నిమిత్తం బాలానగర్ చెందిన సుమారు 50 మంది కూకట్‌పల్లిడిపో బస్సులో తరలివచ్చారు. కార్యక్రమం అనంతరం బస్సులో తిరిగి వెళుతుండగా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ వద్ద అగివున్న లారీని బస్సు అతివేగంగా ఢీకొట్టింది.

ఈ సంఘటనలో వరుడు, వధువుతోపాటు మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం రాత్రి 11:00 గంటలకు చోటుచేసుకుంది.





























