సాధారణంగా అయితే అందరూ కాస్త అందంగా కనిపించడానికి మేకప్ వేసుకోవడం చేస్తూ ఉంటారు. కానీ సినీ సెలబ్రిటీలు ఏకంగా రూపురేఖలు మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎంతోమంది ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.. ఇలా ఇప్పటి వరకు ఎంతో మంది సెలబ్రిటీలు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తమ అందానికి మరింత మెరుగులు దిద్దుకున్నవారు చాలా మంది ఉన్నారు.

ఇలా ఇటీవలికాలంలో అందాన్ని కాస్త పెంచుకోవడానికి హీరో హీరోయిన్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది.. కానీ ఇప్పటికీ కొంతమంది హీరోయిన్లు మాత్రం ప్లాస్టిక్ సర్జరీ కి దూరంగా సహజసిద్ధమైన అందంతోనే ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాంటి వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

దీపికా పదుకొనే : ఓవైపు గ్లామర్ పాత్రలు చేయడంతో పాటు మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తూ తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను కట్టిపడేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాగా దీపికా పదుకొనే ఇప్పటివరకు ఒక్క ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకోలేదట.

సాయి పల్లవి : ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో నాచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి. ఈ అమ్మాయి హీరోయిన్ ఏంటి అనే స్థాయి నుంచి హీరోయిన్ అంటే ఇలాగే ఉండాలి ఇలాగే నటించాలి అనే స్థాయికి ఎదిగింది. ఇక ఎప్పుడు సహజసిద్ధంగా కనిపించే సాయి పల్లవి కూడా ఇప్పటివరకు సర్జరీల జోలికి పోలేదట.

ఆలియా భట్ : బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా ఈ అమ్మడు సుపరిచితురాలే. ఇప్పటికే బాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో కూడా పలువురు హీరోల సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. సర్జరీల విషయానికి వస్తే ఆలియా భట్ కూడా ఇప్పటివరకు సర్జరీ వైపు మొగ్గు చూపలేదట. నాచురల్ అందంతోనే ప్రేక్షకులను అలరిస్తుందట ఈ ముద్దుగుమ్మ.

శ్రద్ధా కపూర్ : బాలీవుడ్లో హాట్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న శ్రద్ధా కపూర్ ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటూ అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఈ అమ్మడు కూడా సర్జరీ లకు దూరంగానే ఉందట. తన అందానికి మరింత మెరుగులు దిద్దేందుకు సర్జరీ జోలికి పోలేదట శ్రద్ధాకపూర్.































