Pavithra Lokesh: కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పలు సినిమాలలో నటించిన అనంతరం ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెంటిమెంట్ పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎన్నో సినిమాలలో తల్లి, అక్క, వదిన పాత్రలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవిత్ర లోకేష్ గురించి గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి.

పవిత్ర లోకేష్ ఇప్పటికే కన్నడ సినీ పరిశ్రమకు చెందిన
సుచేంద్ర ప్రసాద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని మనస్పర్థల కారణంగా తనతో విడాకులు తీసుకున్న ఈమె సీనియర్ నటుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తితో చాలా చనువుగా ఉందని వీరిద్దరూ ప్రేమలో కూడా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే త్వరలో ఆ సీనియర్ నటుడితో పవిత్ర లోకేష్ ను పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెలుస్తోంది.

గతంలో వీరిద్దరూ ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. ఇలా వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. గత ఎన్నికలలో భాగంగా వీరిద్దరు కూడా మంచు ప్యానెల్ కి సపోర్ట్ చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి వెళ్లిన వీరిద్దరూ కలిసి వెళ్లడంతో వీరి గురించి పెద్దఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి.
మూడు పెళ్లిళ్లు చేసుకున్న నటుడు..
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఆ నటుడు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నప్పటికీ ఒకప్పుడు హీరోగా పలు చిత్రాల్లో నటించారు. అయితే ఆయన కూడా గతంలో మూడు పెళ్లిళ్లు చేసుకుని పలు మనస్పర్థల కారణంగా వారి భార్యకు విడాకులు ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఒంటరిగా ఉన్న నటుడు పవిత్ర లోకేష్ ప్రేమలో ఉన్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఈ క్రమంలోనే త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వస్తున్న వార్తలో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియాల్సి ఉంది.































