భూప్రపంచంపై అత్యంత విషపూరితమైన జీవుల్లో పాములు కూడా ఒకటి. పాముల్లో కొన్ని పాములు విషపూరితం కానప్పటికీ కొన్ని పాములు మాత్రం కాటేస్తే నిమిషాల్లోనే ప్రాణాలు పోతాయి. తాజాగా ఒక పాము కాటు వేయకపోయినా ఇద్దరు పిల్లల ప్రాణాలు పోవడానికి కారణమైంది. పాము తాగిన పాలను తాగిన కవల పిల్లలు కొన్ని నిమిషాల్లోనే మృతి చెందారు. ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన వల్ల స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గాజీపూర్ ప్రాంతంలో ఛోట్నామర్ద్ అనే గ్రామం ఉంది. నిన్న రాత్రి రెండు గంటల సమయంలో కవలలు పాల కోసం గుక్క పెట్టి ఏడ్చారు. దీంతో పిల్లల కోసం తీసిపెట్టిన పాలను తీసుకునివచ్చి తండ్రి పిల్లలకు పాలు పట్టించాడు. పాలు తాగిన కొన్ని నిమిషాలకే కవలల నోటి నుంచి నురుగ వచ్చింది. ఎప్పుడూ లేని విధంగా పిల్లల నోటి నుంచి నురగ రావడంతో తండ్రి షాక్ అయ్యాడు.
 
అదే సమయంలో పరిసరాలను గమనించగా అక్కడ ఒక కప్పను పాము మింగుతూ కనిపించింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన పిల్లల తండ్రి గట్టిగా కేకలు పెట్టాడు. దీంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. వాళు పాము తాగిన పాలు తాగడం వల్లే పిల్లలు నురగ కక్కి ఉంటారని భావించారు. కవలలను వెంటనే తండ్రి సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే కవలలు మృతి చెందారని తెలిపాడు.
 
దీంతో కుటుంబ సభ్యులంతా బోరున విలపిస్తున్నారు. ఊహించని ఈ ఘటన కుటుంబంలో విషాదం నింపింది. పిల్లలు తల్లిదండ్రులను ఓదార్చాలని ఎంత ప్రయత్నించినా వారిని ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here