పుట్టిన ప్రతీ మనిషికి ముసలితనం అనేది వస్తుంది. బాల్యం నుంచి ఎన్నో కష్టాలు, సుఖాలతో అనుభవిస్తూ చివరి మజిలీ వరకు చేరుకుంటారు. అయితే ముసలితనం అనేది కొంత మందికి త్వరగా వస్తుంది.. మరి కొంతమందికి లేట్ గా వస్తుంది. అంటే ఏంటంటే.. మంచి ఆహారం వ్యాయామం చేసే వారికి అనారోగ్య సమస్యలు రాకుండా ఎక్కువ కాలం ఉంటారు. దీంతో లేట్ వయస్సులో వాళ్లు ముసలితనానికి వచ్చి ఇతరులపై ఆధారపడతారు. భయట దొరికే ప్రతీ వస్తువు తినడం వల్ల అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకొని కొంత మంది త్వరగా మంచాన పడతారు.

వారు ఇతరులపై ఆధారపడటం మొదలైందంటే.. ముసలి తనానికి వచ్చినట్లే. అయితే ఇలా కాకుండా కొన్ని ఐటెమ్స్ మనం తినకుండా ఉంటే ఆరోగ్యంగా ఉండొచ్చని వైద్యులు తెలిపారు. అవేంటంటే.. పాశ్చాత్య దేశాల సంస్కృతి మన దేశంలో భాగా పాకాయి. వేసుకునే దుస్తుల దగ్గర నుంచి తినే తిండి వరకు అంతా రెడీ మేడ్ గా ఉండాలని కోరుకుంటున్నారు. పిజ్జాలు, బర్గర్లకు ఎంత దూరం ఉంటే అంత మంచిది.. ఇవి ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి.
వీటి ద్వారా శరీరంలో కొవ్వు పెరిగి పొట్ట వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని ఎంత తగ్గిస్తే… అంతలా మీరు ముసలితనానికి దూరమవుతారని డాక్టర్లు చెబుతున్నారు. కేక్‌లు, పాస్ట్రీలు, ఫ్యాట్స్ లకు కూడా దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చిప్స్ ఎక్కువగా తినే అవకాశం ఉంటే వారు మానేయడం మంచిదంటున్నారు.
మద్యం తాగడం, స్మోకింగ్ వంటివి కూడా ముసలితనానికి దారి వెతుకుతాయి. బాడీ త్వరగా డీహైడ్రేట్ అవుతుంది. అది చర్మంపై ప్రభావం చూపి… ముడతలు వచ్చేలా చేస్తుంది. అంతే కాకుండా ఎనర్జీ డ్రింకులు, కూల్ డ్రింకులు తాగడం మానేయడం మేలు. వాటి బదులు ఫ్రూట్ జ్యూస్‌లు తాగితే మేలు. ఇలా వీటిని దూరం పెడితే ముసలితనానికి రాకుండా ఉంటాం.



























