Dasari Narayana Rao:తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దగా దాసరి నారాయణరావు ఎలాంటి గుర్తింపు సంపాదించుకున్నారో మనకు తెలిసిందే. ఈయన దర్శకుడిగా నటుడిగా నిర్మాతగా ఎన్నో సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీ పెద్దగా ఇండస్ట్రీ బరువు బాధ్యతలను కూడా తన భుజాలపై మోశారు. దాసరిగారు డైరెక్టర్ ధవళ సత్యం ఇద్దరు మంచి స్నేహితులు. ఇద్దరిదీ ఒకే ఊరు కావడంతో దాసరి సహాయంతో ఈయన ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

అప్పటికే దాసరి నారాయణరావు ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్. ఇక ఇండస్ట్రీలో దాసరి గారి దగ్గర అలా మెలగాలి ఇలా మెలగాలి అంటూ చాలా మంది చాలా కండిషన్స్ పెట్టారు. అయితే అది నచ్చక ఇండస్ట్రీ నుంచి వెనక్కి వచ్చేద్దామని భావించాను. కానీ గురువు గారి ప్రోత్సాహంతో తాను ఇండస్ట్రీలో కొనసాగానని ధవళ సత్యం తెలిపారు. ఇద్దరం స్నేహితులమే అయినప్పటికీ తనని ఎప్పుడు గురువుగానే భావిస్తూ అన్నయ్య అంటూ పిలుస్తానని ధవళ సత్యం తెలిపారు.

ఇండస్ట్రీలో వీరిద్దరి అనుబంధం గురించి చెబుతూ దాసరి చివరి క్షణాలు గురించి కూడా ఈ సందర్భంగా దవళ సత్యం తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు. దాసరి గారితో తనకు ఎంతో మంచి అనుబంధం ఉందని ఆయన చనిపోయే ముందు తన పక్కన ధవళ సత్యం అనే వాడు ఉండాలని కోరుకున్నాడు అంటూ ఎమోషనల్ అయ్యారు.
నాతో పాటు ఉండరా…అన్నారు
దాసరి గారి చివరి రోజులలో తన పక్కన ఉండాలని పిలిపించడంతో నేను, రామకృష్ణ, రేలంగి నరసింహారావు ముగ్గరం ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు వెళితే దాదాపు ఎనిమిది గంటల వరకు ఆయనతో కలిసి మాట్లాడుతూ ఆయనతోనే సమయం గడిపాము. ఒక రోజు కాస్త ఆలస్యంగా వెళితే నాతోపాటు ఉండరా.. అని అడగగా ఉంటాను అన్నయ్య అంటూ తన చేతిని ఇలా పట్టుకున్నాను. తాను కూడా నా చేతిని అలా పట్టుకొని స్ట్రేక్చర్ పై లోపలికి వెళ్ళాడు. ఇక తిరిగి రాలేదు. ఆయన అడిగాడని నేను ఉన్నాను,కానీ ఆయన తిరిగి రాలేదు అంటూ ఈ సందర్భంగా దాసరి గారి గురించి ధవళ సత్యం గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.




























