బిగ్ బాస్ కార్యక్రమం మొదటి వారం పూర్తిచేసుకుని హౌస్ నుంచి సరయు ఎలిమినేట్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఇలా 19మంది కంటెస్టెంట్ లో ఒకరి ఎలిమినేట్ కాగా ప్రస్తుతం హౌస్ లో 18 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ 18 మంది సండే ఎంతో సరదాగా గడిపిన, సోమవారం నుంచి వీరికి అసలు ఆట మొదలవుతుంది.
సోమవారం నామినేషన్స్ లోభాగంగా కంటెస్టెంట్స్ మధ్య తారాస్థాయిలో మాటల యుద్ధం జరుగుతూ ఒకరినొకరు నామినేట్ చేసుకుంటారు. ఈ విధంగా ఈ వారం నామినేషన్ లిస్ట్ లో ఈసారి ఏకంగా ఏడు మంది కంటెస్టెంట్స్ ఉండటం గమనార్హం.ఈ వారం నామినేషన్స్ లో భాగంగా కంటెస్టెంట్స్ ప్రియా, ఉమాదేవి, ప్రియాంక సింగ్, కాజల్, నటరాజ్, లోబో, అనీ మాస్టర్ ఉన్నారు.
ఈ ఏడుగురిలో ఎవరు ఎన్ని ఓట్లు సాధించి హౌస్ లో ఉంటారు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం గురించి సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.ఈ వారం నామినేషన్ లిస్ట్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉండడంతో డబల్ ఎలిమినేషన్ ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటే ఎలిమినేషన్ కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.
గత వారం రోజుల నుంచి ప్రసారమైన కార్యక్రమాన్ని చూస్తే ఈ వారం ఎలిమినేషన్ లో మోడల్ జస్వంత్, లహరి ఉంటారని చాలామంది భావించినప్పటికీ ఈ ఇద్దరు కంటెస్టెంట్స్ నామినేషన్ లిస్ట్ లో లేకపోవడం గమనార్హం. ఇక ఈ వారం నామినేషన్ నుంచి హమీద తప్పుకున్నట్లు తెలుస్తోంది.ఈ వారం నామినేషన్ లిస్ట్ లో ఉన్న ఈ ఏడుగురు ఏ విధంగా ప్రేక్షకులను మెప్పించి ఎవరు సేఫ్ జోన్ లోకి వెళ్తారు, ఎవరు డేంజర్ జోన్లో ఉంటారు అనే విషయం తెలియాల్సి ఉంది.
విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…
ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…
ఉదయం నిద్రలేవగానే బెడ్‌ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…