ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియను శరవేగంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోని 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందిస్తున్నారు. మొదట్లో వ్యాక్సిన్ పట్ల ప్రజలలో అవగాహన లేక వ్యాక్సినేషన్ కోసం ఎవరూ ముందుకు రాలేదు. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు కలుగుతాయని అపోహలు ఉండటం వల్ల వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపించేవారు కాదు.అయితే అధికారులు వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టిన తర్వాత ప్రజలు స్వచ్ఛందంగా వాక్సినేషన్ కోసం ముందుకు వస్తున్నారు.

సాధారణంగా మనం ఏదైనా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు మనలో స్వల్ప లక్షణాలు కనిపించడం సర్వసాధారణమే. ఈ విధంగా కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరిలో తలనొప్పి, జ్వరం, చలి, కండరాల నొప్పులు మొదలైన లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే వీటి ప్రభావం కేవలం రెండు రోజులు మాత్రమే ఉంటుంది. మనం వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొన్ని జాగ్రత్తలను పాటించడం వల్ల ఏ విధమైనటువంటి దుష్పరిణామాలు తలెత్తవు.అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పనులు చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం….
చాలామంది వ్యాక్సిన్ వేయించుకున్నాము కదా అని వారి ఇష్టానుసారంగా బయట తిరుగుతుంటారు అయితే ఇది పెద్ద తప్పు. వ్యాక్సిన్ వేయించుకున్న కూడా బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు ధరించడం సామాజిక దూరం పాటించడం ఎంతో అవసరం. కొన్నిసార్లు వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత కూడా మనలో కరోనా లక్షణాలు కనపడతాయి. ఈ విధమైనటువంటి లక్షణాలు కనిపించినప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా వహించకుండా వెంటనే సరైన చికిత్స తీసుకోవాలి.
చాలామందికి ధూమపానం, మద్యపానం అలవాటు ఉంటాయి.అయితే వ్యాక్సిన్ వేయించుకున్న కొన్ని రోజుల పాటు వీటికి దూరంగా ఉండటం వల్ల వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుంది. అదేవిధంగా వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత ఎక్కువగా నీటిని తాగాలి ముఖ్యంగా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మన శరీరంపై ఎలాంటి టాటూలు వేయించుకోకూడదు. ఈ విధంగా వేయించుకోవడం వల్ల ఆ ప్రభావం మన రోగ నిరోధక శక్తిను ప్రేరేపిస్తుంది.అలాగే వ్యాక్సిన్ వేయించుకున్న రెండు మూడు రోజుల పాటు ఏ విధమైనటువంటి కఠిన శరీర వ్యాయామాలను చేయకూడదు.



























