మారుతున్న కాలంతో పాటే టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దొంగలు కూడా ఇళ్లకు వెళ్లి దొంగతనాలు చేయడం మాని ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. పోలీస్ స్టేషన్లలో కూడా ఎక్కడో ఒకచోట మినహా దొంతనాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదు కావడం లేదు. అయితే తాజాగా ఒక ఇంటికి దొంగతనానికి వెళ్లిన దొంగ తన తెలివితక్కువతనంతో సులభంగా దొరికిపోయాడు.

దొంగ చేసిన తప్పే అతనిని పట్టించింది. ఆ వ్యక్తి దొంగతనం చేయడానికి వెళ్లి అదే ఇంట్లో నిద్రపోయి గురక పెట్టడంతో ఇంటి సభ్యులకు సులభంగా దొరికిపోయాడు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గోకవరానికి చెందిన సత్తి వెంకటరెడ్డి అనే వ్యక్తికి పెట్రోల్ బంకు ఉండేది. రోజూలానే వెంకట్ రెడ్డి రాత్రి 10.15 గంటలకు పెట్రోల్ బ్యాంక్ కార్యకలాపాలు ముగించుకుని ఆ వ్యక్తి ఇంటికి చేరుకున్నాడు.
 
వెంకట్ రెడ్డి క్యాష్ బ్యాగ్ ను కొట్టేద్దామని ముందుగానే ప్లాన్ వేసిన దొంగ ప్లాన్ ప్రకారం వెంకట రెడ్డితో పాటే ఇంట్లోకి దూరాడు. ఇంట్లోకి ప్రవేశించిన అనంతరం దొంగ ఒక మంచం కింద దూరాడు. అయితే దొంగతనం చేయాలని వచ్చిన దొంగ అప్పటికే అలసిపోయి ఉండటంతో మంచం కిందే నిద్రపోయాడు. దొంగ గురక పెట్టడంతో వెంకటరెడ్డికి మెలుకువ వచ్చింది.
 
గదిని పరిశీలించగా మంచం కింద దొంగ దాక్కున్నాడని గుర్తించారు. తన భార్యకు విషయం చెప్పి తలుపుకు గడియ పెట్టి వెంకటరెడ్డి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అదుపులోకి తీసుకుని దొంగ ముఖానికి క్యాప్ తీసి తమకు బాగా పరిచయం ఉన్న సోడమల్లి సూరిబాబు దొంగతనం చేయడానికి ప్రయత్నించాడని పేర్కొన్నారు. పోలీసుల విచారణలో డబ్బు అవసరం కావడంతో దొంగతనానికి ప్రయత్నించానని సూరిబాబు చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here