Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే సమంత పలు వెబ్ సిరీస్ లు, సినిమాలలో నటిస్తూ పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. కెరీయర్ లో ఎంతో బిజీగా ఉంటున్న సమంత ఇంట్లో అర్ధరాత్రివేళ దొంగలు పడ్డారు. ఇదే విషయాన్ని సమంత సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

సమంత ఇంట్లో దొంగలు పడ్డారు అంటే నిజమైన దొంగలు కాదండోయ్…ఒక యాడ్ లో భాగంగా జరిగిన ఈ సంఘటనను సమంత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే సమంత బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి చేసిన ఒక యాడ్ లో నటించారు.

ఈ క్రమంలోనే అక్షయ్ కుమార్ సమంత కలిసి కుర్ కురే యాడ్ లోనటించారు.ఈ యాడ్ లో భాగంగా అక్షయ్ కుమార్ అర్ధరాత్రివేళ సమంత ఇంటికి దొంగతనానికి వస్తారు. ఇలా దొంగతనానికి వచ్చిన అక్షయ్ కుమార్ కు సమంత ఇంటిలో కుర్ కురే కనిపించడంతో ఎంతో ఆతృతగా ఆ ప్యాకెట్ ఓపెన్ చేస్తున్న సమయంలో సమంత ఇంటి సభ్యులు తనని పట్టుకుంటారు. ఇలా తన చేతిలో ఉన్న ప్యాకెట్ తీసుకొని సమంత తింటూ ఆ రుచిని ఆస్వాదించగా అక్షయ్ కుమార్ కి తినాలి అనే భావన కలుగుతుంది.
ఇలా దొంగ గా మారడం ఏంటో …
ఇదే సమయంలోనే సమంత కావాలా అని అతనిని అడగగా అందుకు అక్షయ్ కుమార్ కావాలని చెప్పడంతో ప్యాకెట్ మొత్తం ఇస్తారు. పాకెట్ మొత్తం తిన్న తర్వాత అక్షయ్ కుమార్ బయటకు వెళ్తుంటే సమంత ఆగు బండి వస్తుందని చెబుతుంది.బండి కూడా వస్తుందా అంటూ ఆశ్చర్యపోయిన అక్షయ్ కుమార్ అంతలోనే పోలీస్ సైరన్ వినిపించడంతో కంగారు పడతారు. ప్రస్తుతం ఈ వీడియోని సమంత సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ సినిమాలో పోలీస్ గా నటించిన అక్షయ్ కుమార్ ఇలా
కుర్ కురే కోసం దొంగగా మారడం ఏంటో అంటూ ఈ వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Police officer of the movies turns out to be a Kurkure chor. @akshaykumar ???? this behaviour?#Kurkure #AbLagaMasala @KurkureSnacks pic.twitter.com/s5T5OZtyO2
— Samantha (@Samanthaprabhu2) January 11, 2022





























