Sandalwood Smuggling: పుష్ప సినిమా తరహాలో స్మగ్లింగ్ సీన్ లను రిపీట్ చేసిన దొంగలు.. ఎక్కడో తెలుసా?

0
238

Sandalwood Smuggling: టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన విషయం తెలిసింది. పాన్ ఇండియా సినిమాగా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా కలెక్షన్లను రాబట్టిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ టాక్ ను అందుకుంది. కాగా పుష్ప 2 సినిమాను అంతకుమించి ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా విడుదలైన తర్వాత మొదట పాజిటివ్ గా కంటె నెగిటివ్ గానే ఎక్కువగా వార్తలు వినిపించాయి.

 Sandalwood Smuggling: పుష్ప సినిమా తరహాలో స్మగ్లింగ్ సీన్ లను రిపీట్ చేసిన దొంగలు.. ఎక్కడో తెలుసా?
Sandalwood Smuggling: పుష్ప సినిమా తరహాలో స్మగ్లింగ్ సీన్ లను రిపీట్ చేసిన దొంగలు.. ఎక్కడో తెలుసా?

అలాగే ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో అదేవిధంగా విమర్శలను సైతం ఎదుర్కొంది. మరియు ముఖ్యంగా సినిమాలో స్మగ్లింగ్ సీన్లపై చాలామంది విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే స్మగ్లింగ్ చేసేవారికి పుష్ప సినిమా ద్వారా కొత్త కొత్త ఐడియాలు ఇస్తున్నారు అంటూ విమర్శలు చేశారు. అంతేకాకుండా ఈ సినిమా విడుదలైన తర్వాత చాలా చోట్ల పుష్ప సినిమా తరహాలోనే స్మగ్గింగ్ సీన్లను రిపీట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. గుజరాత్ లోని పుష్ప మూవీని తలదన్నే రేంజ్ లో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు.

 Sandalwood Smuggling: పుష్ప సినిమా తరహాలో స్మగ్లింగ్ సీన్ లను రిపీట్ చేసిన దొంగలు.. ఎక్కడో తెలుసా?
Sandalwood Smuggling: పుష్ప సినిమా తరహాలో స్మగ్లింగ్ సీన్ లను రిపీట్ చేసిన దొంగలు.. ఎక్కడో తెలుసా?

అంతేకాకుండా అందరూ పుష్ప రాజ్ గెటప్ లో అల్లు అర్జున్ బొమ్మ ఉన్న టీ షర్టులు ధరించడమే కాకుండా, సినిమాలో పుష్పరాజ్ మాదిరిగానే నడుముకు ఎర్ర టువాళ్లు చుట్టుకొని మరి స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు. తాజాగా వీరిని పోలీసులు అరెస్టు చేయగా వారు పుష్ప గ్యాంగ్ గా ప్రచారం అవుతున్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన ఈ గ్యాంగ్ గుజరాత్ లోని గ్రామాల్లో గుడారాలు వేసుకొని వనమూలికలు, దువ్వెనల విక్రయాల పేరుతో ఎర్రచందనపు చెట్లను దొంగలించి యూపీలో విక్రయిస్తూ ఉంటారు.

గుజరాత్ లో రెచ్చిపోయిన పుష్ప గ్యాంగ్..

అయితే ఈ ముఠాలో పిల్లలు మహిళలు కూడా ఉన్నారు. సౌత్ రాష్ట్రాలతో పాటు ప్రస్తుతం గుజరాత్ లాంటి ప్రాంతాల్లో కూడా ఎర్రచందనం చెట్లను పెంచడం ప్రారంభించారు. వీటి పెంపకంతో రైతులకు ప్రయోజనం కలిగించాలి అన్న ఉద్దేశంతో కేవలం అడవుల్లో మాత్రమే కాకుండా ప్రైవేట్ స్థలాల్లో కూడా ఎర్రచందనం చెట్ల పెంపకానికి ప్రభుత్వం కూడా అనుమతినిచ్చిందట. ప్రస్తుతం ఎర్రచందనానికి బాగా డిమాండ్ ఉండడంతో స్మగ్లింగ్ చేసే వారు మరింత రెచ్చిపోతున్నారు. మొదట వీరు ఊర్లో మూలికలు దువ్వెన విక్రయించడానికి వచ్చినట్లు నటించి, ఆ తర్వాత గుడారాలు ఏర్పాటు చేసుకుని పగటిపూట గ్రామం మొత్తం గాలించి ఎక్కడైతే ఎర్రచందనం ఉన్నాయా అని వెతికి చూస్తారట. ఆ తర్వాత అందరూ నిద్ర పోయిన తర్వాత ఎర్రచందనం చెట్లను నరికివేసి ఆ తర్వాత ఆ ముక్కలను భూమిలో దాస్తారట. ఆ తర్వాత అవి ఎవరికంటా పడకుండా రాష్ట్రం దాటించేస్తారట. అలా దాదాపుగా రెండున్నర నెలలుగా ఈ విధంగా చేస్తున్నట్లు పోలీసుల ముందు అంగీకరించారు పుష్ప గ్యాంగ్.