Road Roller: వామ్మో …ఈ దొంగలు మామూలు దొంగలు కాదుగా!.. ఏకంగా రోడ్డు రోలర్ ని దొంగలించారు!

0
153

Road Roller: సాధారణంగా దొంగలు ఎవరికీ కనిపించకుండా చిన్న చిన్న వస్తువులను దొంగతనం చేయడం లేదా డబ్బు నగలను దొంగతనం చేయడం గురించి మనం వింటూనే ఉంటాం. కానీ మీరు ఎప్పుడైనా రోడ్డు రోలర్ దొంగతనం చేయడం గురించి విన్నారా.. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ వింత ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

Road Roller: వామ్మో …ఈ దొంగలు మామూలు దొంగలు కాదుగా!.. ఏకంగా రోడ్డు రోలర్ ని దొంగలించారు!
Road Roller: వామ్మో …ఈ దొంగలు మామూలు దొంగలు కాదుగా!.. ఏకంగా రోడ్డు రోలర్ ని దొంగలించారు!

వికారాబాద్‌ జిల్లా తాండూరులో బ్రిడ్జి పనులు నిమిత్తం రోడ్డు రోలర్ ను యజమాని నరసింహారెడ్డి తాండూరుకు తీసుకువెళ్లారు.సుమారు ఐదు నెలల పాటు ఈ బ్రిడ్జి పనులు నిర్వహించిన తర్వాత బ్రిడ్జికి సంబంధించిన బిల్లు రాకపోవడంతో ఆయన వేరే ఊరికి వెళ్ళిపోయారు.కొన్ని నెలల తరువాత నరసింహా రెడ్డి తిరిగి రోడ్డు రోలర్ తీసుకువెళ్లడానికి ఆ గ్రామానికి రావడంతో ఆయనకు వింత ఘటన ఎదురయింది.

Road Roller: వామ్మో …ఈ దొంగలు మామూలు దొంగలు కాదుగా!.. ఏకంగా రోడ్డు రోలర్ ని దొంగలించారు!
Road Roller: వామ్మో …ఈ దొంగలు మామూలు దొంగలు కాదుగా!.. ఏకంగా రోడ్డు రోలర్ ని దొంగలించారు!

ఆయన వదిలిన చోట రోడ్డు రోలర్ కనిపించకపోవటంతో షాకైన నరసింహారెడ్డి ఏం జరిగిందని ఆరాతీస్తే అసలు విషయం బయటపడింది.జినుగుర్తికి చెందిన షాబోద్దిన్‌ రోలర్‌ను లారీలో తీసుకెళ్లారని గ్రామస్తులుచెప్పడంతో నరసింహారెడ్డి అతనిని ఆరాతీస్తే కొంతమంది రోడ్డు రోలర్ తనకు అమ్మారని అందుకే ఒక లారీని బాడుగకు మాట్లాడుకొని రోడ్డు రోలర్ తీసుకు వచ్చానని తెలిపారు.

ముక్కలు ముక్కలుగా రోడ్డు రోలర్…

అయితే తాను తీసుకువచ్చిన రోడ్డు రోలర్ ఎక్కడ ఉంది అని నర్సింహారెడ్డి అతనిని అడగడంతో తను గోదాముకు తరలించినట్టు తెలిపారు. ఇక నరసింహారెడ్డి పాత సామాగ్రి గోదాముకి వెళ్లి చూడడంతో అక్కడ తన రోడ్ రోలర్ విడివిడిగా కనిపించడంతో నరసింహారెడ్డి షాక్ అయ్యారు. ఈ విధంగా రోడ్డు రోలర్ దొంగతనం అయిందనే విషయం తెలియడంతో ఈ విషయం కాస్త చర్చనీయాంశంగా మారింది.