వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ‘పవర్ స్టార్’ చిత్రం తర్వాత ‘కుటుంబ కథా చిత్రమ్’ అనే ట్యాగ్ లైన్ తో ఒక రియల్ స్టోరీని ‘మ ర్డర్’ అనే పేరుతో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్ర కధాంశం ఆమధ్య యధార్ధంగా జరిగిన మిర్యాల గూడ ప్రణయ్ – అమృతల ప్రేమకథలోని మారుతి రావు పరువు, హత్య నేపథ్యం ఆధారంగా రూపొందిస్తున్నట్టు తెలిసింది.

ఈమధ్యనే సోషల్ మీడియాలో ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేస్తూ అమృత, మారుతీరావుల పాత్రలను పరిచయం చేశారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల తేదిని రామ్ గోపాల్ వర్మ తన ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేశాడు. జూలై 28వ తేదీ ఉదయం 9.08 గంటలకు ట్రైలర్ ను విడుదల చేయనున్నట్టు, 5 భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు, తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకే సారి ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్టు తెలియజేశారు. ఇక ఈ చిత్రంలో అమృత పాత్రలో ఆవంచ సాహితి, మారుతిరావు పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ నటిస్తున్నారు. అమృత పాత్రలో నటించనున్న సాహితి ఆవంచ మన తెలుగమ్మాయే కావడం విశేషం.

హైదరాబాద్ కు చెందిన సాహితిని హీరోయిన్ గా వెండితెరపై చూడాలనేది ఆమె తల్లి కోరికంట. అందుకే సాహితి కోసం టాలీవుడ్ మొత్తం కాళ్ళరిగేలా తిరిగి చివరికి బుల్లితెరపై కొన్ని షోలు చేసే ఛాన్స్ సాహితికి దక్కేలా చేసిందట. ఆ తర్వాత బాలనటిగా కూడా కొన్ని చిత్రాలలో సాహితి నటించిందంట. అంతే కాకుండా ‘బాయ్’ అనే తెలుగు చిత్రంలో హీరోయిన్ గా నటించిందంట. ఇప్పుడు లేటెస్ట్ గా మన టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీస్తున్న “మర్డర్” చిత్రంలో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుందన్నమాట.