ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తుంది. ఇక మన దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉద్ధృతికి రాష్ట్రాలన్నీ వణికిపోయాయి. అయితే ఈ మహమ్మారి బారినుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఈ క్రమంలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుండడంతో వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చినట్లు భావిస్తూ పలు రాష్ట్రాలు ఇప్పటికే విధించిన కోవిడ్ ఆంక్షలను ఎత్తివేస్తున్నాయి. అయితే మన దేశంలో అక్టోబర్ నాటికి థర్డ్‌వేవ్ సంభవించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అయినా కూడా ప్రస్తుతం సెకండ్ వేవ్ ను ఎదుర్కొన్న తీరుతో పోలిస్తే.. ఒకవేళ మూడో వేవ్ ముప్పు వచ్చినా కూడా సమర్థంగానే నియంత్రించే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. భారత్‌లో ప్రస్తుతం కొనసాగుతోన్న వ్యాక్సిన్ ప్రక్రియను చూస్తుంటే రానున్న రోజుల్లో సంభవించే మరో ముప్పును నియంత్రించవచ్చని మెజారిటీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.



























