మే 31 వరకు ఇవన్ని ముసివేయాల్సిందే.. కేంద్ర హోం శాఖ కొత్త మార్గదర్శకాలు !

0
473

మే 31 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ చర్యలు తీసుకుంది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధారిటీ. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు మే 31 వరకు లాక్ డౌన్ పొడిగించాలని కోరింది. అయితే ఇప్పటికే పలు రాష్ట్రాలు మే 31 వరకు లాక్ డౌన్ ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే లాక్ డౌన్ 4.0 కు సంబంధించి మినహాయింపులు, మార్గదర్శకాలను కేంద్ర హోమ్ శాఖ గైడ్ లైన్స్ జారీ హోం శాఖ. కేంద్ర హోమ్ శాఖ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

మే 31 వరకు ఇవి తప్పనిసరిగా మూసివేయాల్సిందే…

  • మే 31 వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది.
  • దేశీయ మరియు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు.
  • అన్ని మెట్రో సర్వీసులు బంధ్
  • స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు బంద్ (ఆన్లైన్ క్లాసులు మినహాయింపు)
  • హోటళ్లు, రెస్టారెంట్లు బంద్ (ఆరోగ్య సిబ్బంది, అత్యవసర సిబ్బంది ఉండే వాటికీ మినహాయింపు ) మరియు హోమ్ డెలివరీ చేసే కిచెన్లు నిర్వాహణకు అనుమతి.
  • సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్, పార్కులు, బార్లు, ఆడిటోరియాలు, క్రీడా ప్రాంగణాలు బంద్
  • జన సమూహం ఎక్కువగా ఉండే సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఫంక్షలకు అనుమతి లేదు.
  • ఆలయాలు, చర్చిలు, మసీదులు బంద్