టిక్ టాక్ దుర్గారావు ఒక్క యూట్యూబ్ ఇంటర్వ్యూ కి ఎంత తీసుకుంటున్నాడంటే..?

0
215

సామాన్యులు కూడా వెండితెరపై కానీ బుల్లితెరపై కానీ కనిపించకుండా స్టార్ లు అయిపోతున్నారు. ఫేమస్ పీపుల్ అయిపోతున్నారు. ఇది ఒక్కరాత్రికి అయినా అవకున్నా ఓ స్టార్ అవ్వాలంటే పెట్టె రోజులకన్నా తక్కువ సమయమే పడుతుంది.. టిక్ టాక్ రాకతో ఎంతో మంది మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు.. అది బాన్ అయిపోవడంతో వారి మళ్ళీ యధాస్థానానికి వచ్చినట్లు అయ్యింది. అయితే దానికి ప్రత్యామ్నాయంగా వారు యూట్యూబ్ ని ఎంచుకుని అక్కడ తమ కళను ప్రదర్శిస్తూ ఫేమస్ అయిపోతున్నారు..

అందులో ఒకరు దుర్గారావు.. పలాస సినిమాలో పాట ను టిక్ టాక్ లో చేస్తూ ఎంతో పాపులారిటీ సంపాదించినా దుర్గ రావు అక్కడ వచ్చిన పాపులారిటీ తోనే బులితెరపై మెరిశారు. అంతేకాదు వెండితెరపై మెరిసేందుకు సిద్ధంగా ఉన్నారు. యూట్యూబ్ లో తనదైన స్టైల్ లో ప్రేక్షకులను అలరిస్తున్న దుర్గ రావు కి ప్రతి నెల రూ. 50 వేలకు పైగా ఆదాయం వస్తోందత.. అంతేకాదు బ్రాండ్ ప్రమోషన్స్ నుంచి కూడా ఆదాయం వస్తోంది. ఇక యూట్యూబ్ చానెల్స్ కు దుర్గారావు దంపతులు ఇంటర్వ్యూలు ఇస్తూ అక్కడ కూడా డబ్బులు చార్జ్ చేస్తున్నారని తెలిసింది.

ఒక్కో ఇంటర్వ్యూకు 15 వేల వరకూ డబ్బులు తీసుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. మొత్తానికి ఇలా దుర్గారావు కుటుంబం సోషల్ మీడియాతో తమ కష్టాల నుంచి బయటపడింది.ఇదేకాకుండా దుర్గారావు దంపతులకు ఈవెంట్స్ కు సైతం ఆహ్వానాలు వస్తున్నాయి. ఒకప్పుడు కేవలం బట్టలు కుట్టి జీవించిన దుర్గారావు దంపతులు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వచ్చిన పబ్లిసిటీతో మంచి ఆదాయం పొందుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here