అప్పుడప్పడు మనం వార్తల్లో వింటూ ఉంటాం.. ఆ ఊరిలో పొలాలు దున్నుతుండగా.. ఇంటికి పునాదులు తవ్వుతుండగా.. మైనింగ్ చేస్తున్నప్పుడు పురాతన విగ్రహాలు , సంపద బయటపడుతుంటాయని. వీటిలో ఎక్కువగా దేవతల విగ్రహాలే బయటపడుతుంటాయి. కానీ ఓ చేపల చెరువులో పురాతన విగ్రహాలు బయటపడ్డాయి.

దీంతో జనాలు ఆశ్చర్యపోయారు. ఇలాంటి వాటి కోసం కొందరు ఆలయాల్లోనూ, చారిత్రక ప్రదేశాల్లోనూ తవ్వకాలు జరుపుతుంటారు. అలా కాకుండా ఓ చేపల చెరువులో పురాతన విగ్రహాలు బయటపడటంతో జనం ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు విష్ణుమూర్తి, శివలింగం ఒకేచోట లభ్యం కావడంతో అద్భుతమంటున్నారు. ఈ అరుదైన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా, పాకాల మండలం పెదగోల్పాడు గ్రామంలోని బావి రాగన్న చెరువులో చేపల కోసం మోటర్ తో నీటిని తోడుతుండగా విగ్రహాలు కనిపించాయి.
ఒకే చోట ఇలా విష్ణుమూర్తి, శివలింగం విగ్రహాలు బయటపడ్డాయి. దీంతో స్థానికులు కాస్త ఆశ్చర్యానికి లోనయ్యారు. తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇవి బంగారంతో చేసిన విగ్రహాలు కాదు.. కంచుతో చేసినవి. మూడు అడుగుల విఘ్ణమూర్తి, శివలింగాన్ని సమీపంలోని ఆలయానికి తరలించారు.
విగ్రహాలు స్వతహాగా చెరువులో బయటపడ్డాయా లేక ఎవరైనా దొంగిలించి చెరువులో పడేశారా..? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆ మండల ఎమ్మార్వో సమక్షంలో వివరాలను నమోదు చేశారు పోలీసులు. అనంతరం పరావస్తు శాఖ అధికారులకు సమాచారం అందించి.. విగ్రహాలను ట్రెజరీకి తరలించారు.