తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ గా మరోసారి వైవీ సుబ్బారెడ్డిని నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేసింది. కొత్త బోర్డు సభ్యులను కూడా త్వరలోనే నియమించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

రెండేళ్లకు ఒక్క సారి టీటీడీ పాలకమండలి నియమించడం జరుగుతుంది. ఈ ఏడాది జూన్ 22న పాలకమండలి గడువు ముగిసింది. ఈ మేరకు వైవీ సుబ్బారెడ్డి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. చివరకు తిరిగి ఆయననే సీఎం జగన్ నియమించారు.



































