పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం చేసి కొంత టైమ్ తీసుకొని మళ్లీ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే.. అజ్ఞాతవాసి సినిమా తర్వత పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేయలేదు.. పాలిటిక్స్ లోకి వెళ్లి జనసేన పార్టీ స్థాపించి రాజకీయాలకే పరిమితమయ్యారు.. కానీ అక్కడ అంతాగా సక్సెస్ కాలేక పోయాడు మన పవర్ స్టార్.. మళ్లీ రాజకీయాలకు కొంత విరామం తీసుకొని సినిమాల పై ఫోకస్ పెట్టాడు పవన్ కళ్యాణ్.
టాలీవుడ్ లో పవర్ స్టార్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రేత్యేకించి చెప్ప్కర్లేదు.. పవన్ కల్యాణ్ అంటే ఫ్యాన్స్ ప్రాణాలు అయిన ఇచ్చే అంత అభిమానం చూపిస్తారు.. ఎంతో మంది ఫ్యాన్స్ ఆయన టాటూలు కూడా వేసుకొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. అంతా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది పవర్ స్టార్ కి.. అందుకే పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు అనగానే అభిమానులు పండగ చేసుకుంటున్నారు.. పవన్ కల్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ తో మొదలుపెట్టాలని కొత్త స్టోరీల మీద దృష్టి పెట్టకుండా బాలీవుడ్ పింక్ మూవీ రీమేక్ తో రి-ఎంట్రీ ఇస్తున్నారు..ఈ పింక్ మూవీని తెలుగులో వాకీల్ సాబ్ అనే టైటిల్ పెట్టారు.. ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు చిత్ర యూనిట్… అయితే ఇప్పుడు ఈ వకీలు సాబ్ టైటిల్ కి కూడా సెంటిమెంట్ తిప్పలు తప్పడంలేదు.. ఎందుకంటే మన పికె వకీలు సాబ్ టైటిల్ వద్దంటున్నారు అంట.. జాను సినిమా రిలీస్ అయ్యాక ప్రేక్షకులు ఆ సినిమాను అంతాగా ఆదరించలేదు దీనితో దిల్ రాజు కు కాసుల వర్షం కురిపించే మాట పక్కన పెడితే ఇపుడు వకీలు సాబ్ రీమేక్ టెన్షన్ పట్టుకుందట.. అందుకే ఆ టైటిల్ ని మార్చాలని ఆ టైటిల్ భాద్యతలను న్యూమరాలజీ చేతిలో పెట్టారట..న్యూమరాలజీ ప్రకారం వకీల్ సాబ్ టైటిల్ నీ లాయర్ సాబ్ గా మార్చాలని పండితులు చెప్పారట.. అంతే కాకుండా పవన్ కల్యాణ్ ఫస్ట్ లుక్ బయటకి రాగానే కొంత మంది వకీలు సాబ్ కంటే లాయర్ సాబ్ అయితే బాగుంటుంది అని చెప్పారట.. మొత్తానికి అందరి మాట న్యూమరాలజీ పండితుల ద్వారా ఈ వకీలు సాబ్.. లాయర్ సాబ్ గా రాబోతున్నాడు అని సినిమా వర్గాల సమాచారం… మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్… మెగా స్టార్ సెకండ్ ఇన్నింగ్స్ లా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం…




























