చక్కని రూపం హొయలొలికించే అందం ఆమె సొంతం. తెలుగులో ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో 1993లో జంబలకిడిపంబ సినిమాతో పరిచయమైన కన్నడ భామ ఆమని. అనతి కాలంలోనే టాప్ హీరోలతో జతకట్టే ఛాన్స్ కొట్టేసింది. ఒక చిరంజీవి మినహా మిగతా అందరి హీరోలతో చిందులేసింది. బాలకృష్ణ నటించిన టాప్ హీరో సినిమాలో ఒక సాంగ్ లో తళుక్కుమంది.

మిస్టర్ పెళ్ళాం బాపు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సాంప్రదాయమైన గృహిణి పాత్రలో ఆమని తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. బాపు కళాత్మకత.. రాజేంద్రప్రసాద్ హాస్యచతురత.. ఆమని నట వినమ్రత.. కలిసి సినిమాకి నేషనల్ బెస్ట్ ఫిల్మ్ అవార్డు రావడం జరిగింది. రెండో సినిమాతోనే బాపు దర్శకత్వంలో నటించడం ఆమె సినీ భవిష్యత్ కు పూల బాటగా మారింది.

ఆ తర్వాత ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన శుభలగ్నం సినిమా అత్యాశ గల మరో భిన్నమైన ఇల్లాలి పాత్రను పోషించింది. మాంగల్యము కంటే ధనమే ప్రధానమైనదని తన భర్తను కోటి రూపాయలకు మరో మహిళకు అమ్మేస్తుంది. తర్వాత భర్త పిల్లల ఆప్యాయత అనురాగాలు కరవై పోతాయి… ఈ కథతో వచ్చిన శుభలగ్నం సినిమా ఆమె నటనకు నంది అవార్డు రావడం తెచ్చిపెట్టింది.

ఈమధ్య ఆమని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అందరి హీరోలతో నటించిన చిరంజీవి తో నటించలేక పోయానని.. ఆయనంటే తనకు చాలా అభిమానమని.. ఆయన నటించిన అన్ని సినిమాలోని ఫోటోలను తన ఆల్బమ్ లో పెట్టుకొని తరచూ చూస్తూ ఉండేదాన్నని.. ఒక్కోసారి చిరంజీవి ఆల్బమ్ ను తల దిండు కింద పెట్టుకొని నిద్రపోయేదాన్నని చెప్పుకొచ్చారు.



























