1988 ఆ ప్రాంతంలో హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోకు ఉత్తేజ్ పరిచయంతో జె.డి.చక్రవర్తి అడుగు పెట్టారు. అక్కడ ఆ చిత్రానికి గాను ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఉత్తేజ్ పరిచయం ఉండడంతో సరాసరి లోపలికి వెళుతున్న జె.డి.చక్రవర్తిని ఆడిషన్స్ కి వచ్చినవారు ఆగమన్నారు.

అప్పుడు జె.డి వరసలో నిలబడాల్సి వచ్చింది. అప్పటికీ నటన అంటే తెలియదు. ఎక్స్ప్రెషన్ ఎలా పెట్టాలో రాదు. ఇక ట్రయల్ షూట్ ను చిత్ర విచిత్రంగా పూర్తి చేశాడు. ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ కూడా తనకు రాదని డిసైడ్ అయ్యాడు. కానీ ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ ఆఫీస్ నుండి కాల్ వచ్చింది. జె.డి అన్నపూర్ణ స్టూడియోస్ కు వెళ్ళాడు, నిన్నటి ట్రయల్ షూట్ చూసిన తర్వాత నువ్వు వద్దని నిర్ణయించుకున్నాం అని అనడంతో జె.డి లేచి తిరిగి వెళ్ళి పోసాగాడు. కానీ నిన్న సాయంత్రం 4.30 ని.లకు నీకొక క్యారెక్టర్ ఇద్దామనుకున్నాం అని రాము చెప్పారు. అలా శివ సినిమాలో నాగర్జున చదువుకునే కాలేజీలో స్టూడెంట్ లీడర్ క్యారెక్టర్ చేయడానికి అవకాశం లభించింది.

1989 శివ సినిమా విడుదలైన తర్వాత జె డి చక్రవర్తికి మంచి గుర్తింపు వచ్చింది. అదే సినిమాను హిందీలో తీయడానికి వర్మ, జె.డి చక్రవర్తి ఇద్దరు కారులో వెళుతూ ఒక దగ్గర ఆగిన సందర్భంలో జె.డి.చక్రవర్తిని గుర్తుపట్టిన అభిమానులు శివ సినిమాలో బాగా చేశావు అంటూ మెచ్చుకున్నారు. కానీ పక్కనే ఉన్న రాంగోపాల్ వర్మను ఎవరు పలకరించకపోగా అసలు గుర్తు కూడా పట్టలేదు. అప్పుడు డైరెక్టర్ వర్మ ను వదిలి తనను అప్రిషియేట్ చేయడం వలన జె.డి.చాలా కంగారు పడిపోయాడు.

శివ తో ప్రయాణమైన జేడీ చక్రవర్తి సినీ జీవితం నేటి సిద్ధార్థ, లాఠీ, మనీ, రక్షణ, వన్ బై టూ, అనగనగా ఒక రోజు లాంటి చిత్రాల అనంతరం కృష్ణవంశీ చెప్పిన ప్రేమ కథ జే.డీ కి నచ్చడంతో ఎలాగైనా ఈ సినిమాను చేయాలనే ఉద్దేశంతో తన ఇల్లును అమ్మడానికి నిర్ణయించుకున్నాడు. ఆ విషయం రాంగోపాల్ వర్మ కు తెలియడంతో నేనే ఆ సినిమాకి ప్రొడ్యూస్ చేస్తాను అంతేగాని ఇల్లు మాత్రము అమ్మకు అని చెప్పడం జరిగింది. ఆ విధంగా గులాబీ సినిమా 1995 లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేమికుల గుండెల్లో నిలిచిపోయింది.



























