ఒకప్పుడు సినిమా చాన్స్ కోసం నెలరోజులు తిండి లేకుండా.. చెప్పులరిగేలా తిరిగారు..!!

0
995

తాతమ్మకళ సినిమా షూటింగ్ నిమిత్తం బెజవాడ వచ్చిన ఎన్టీ రామారావు గారికి ఒక స్కూల్ టీచర్ క్యారేజీ లో భోజనం ఇంటి నుండి తీసుకెళ్తుంటే… ఆ మాస్టర్ కొడుకు నేను కూడా షూటింగ్ చూడటానికి వస్తాను అని అనడంతో చేసేదిలేక ఆ మాస్టారు తనతో ఆ కుర్రాడిని షూటింగ్ జరిగే స్పాట్ కు తీసుకెళ్లాడు. అక్కడ ఇసుకేస్తే రాలనంత జనం ఎన్టీ రామారావును చూడడానికి వచ్చారు. జనసందోహాన్ని చూసిన ఆ కుర్రాడు నేను కూడా హీరో కావాలని ఎన్టీ రామారావును అడగడంతో.. నీ ముఖం అద్దంలో ఎప్పుడైనా చూసుకున్నావా అని పెద్దాయన అనడంతో ఆ కుర్రాడు ఒక్కసారి అవక్కయ్యాడు. కానీ ఎన్టీ రామారావు గారి తమ్ముడు త్రివిక్రమరావు సలహాతో చెన్నై వెళ్లి డి.వి.ఎస్. నరసరాజు స్థాపించిన ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేరాడు.

మద్రాసు ఫిలిం ఛాంబర్ ఇనిస్టిట్యూట్లో రెండవ బ్యాచ్ లో హీరో తరుణ్ వాళ్ళ నాన్నగారు చక్రపాణి మరియు రాజేంద్ర ప్రసాద్ నటనలో శిక్షణ తీసుకున్నారు. “మైమ్ అండ్ మూమెంట్”లో ఏకంగా రాజేంద్రప్రసాద్ గోల్డ్ మెడల్ సాధించారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు రాజేంద్ర ప్రసాద్ సాధించిన గోల్డ్ మెడల్ చూసి ఇక రాజేంద్రప్రసాద్ పట్ల చాలా సీరియస్ గా ఆలోచించారు.

మెగాస్టార్ చిరంజీవి, సుధాకర్, హరిప్రసాద్ లాంటి తన దిగువ బ్యాచ్ కి కొన్ని ప్రత్యేక క్లాసులు “మైమ్ అండ్ మూమెంట్” అంశంలో తీసుకున్నారు. ఆ తర్వాత సినిమా అవకాశాలు రాజేంద్ర ప్రసాద్ ను వెతుక్కుంటూ రాలేదు. కొండంత అండ ఎన్టీ. రామారావు ఉన్నప్పటికీ ఆయనను వెళ్లి అడగాలంటే ఆత్మాభిమానం అడ్డొచ్చింది. తిరిగి నిమ్మకూరు వెళదామంటే మనసు రాలేదు.

సినిమా అవకాశాలు ఏ ఒక్కటి రాకపోవడంతో భోజనానికి చాలా కష్టంగా ఉండేది. అలా మద్రాసు వీధుల్లో.. ప్రతిరోజు కేవలం గ్లాస్ మజ్జిగ వీలైతే అరటిపండు తీసుకుంటు.. ఇలా దాదాపు నెల రోజుల పాటు భోజనం చేయకుండా బక్కచిక్కి పోయాడు. చివరగా పుండరీ కక్షయ్య గారిని కలుద్దామని అతని దగ్గరికి వెళ్లాడు. అక్కడ మేలుకొలుపు సినిమాలో హీరో రాజాకృష్ణకు డబ్బింగ్ చెప్పే విషయంలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఆ క్రమంలో రాజేంద్ర ప్రసాద్ ను డబ్బింగ్ చెప్పమని అడగగా.. భోజనం చేసి దాదాపు 30 రోజులు కావస్తోంది. ఫుల్ భోజనం పెట్టించండి… డబ్బింగ్ చెబుతాననడంతో చిత్ర యూనిట్ సభ్యుల్లో ఒక్కసారిగా కళ్ళు తిరిగాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here