టాలీవుడ్ లో అక్క, తల్లి, వదిన పాత్రలతో ఫేమస్ అయింది నటి సత్యక్రిష్ణన్.. ఇంతవరకూ ఎక్కువగా కుటుంబకధా చిత్రాలలోనే నటించి మంచి నటిగా గుర్తింపు సంపాదించుకున్న సత్యకృష్ణన్ సినీ జీవితమే మనందరికి తెలుసు.. కానీ సత్యకృష్ణన్ వ్యక్తిగత విషయాలు చాలామందికి తెలియవు.

సత్యక్రిష్ణన్.. హైదరాబాదులో తన చదువు పూర్తిచేసింది.. ఆ తర్వాత తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ లో జాబ్ లో జాయినైంది. ఎయిర్ హోస్టెస్ కావాలనేది ఆమె ఆశయం. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ లో భాగంగా సత్యకృష్ణన్ ప్రొఫెషనల్ గా పనిచేస్తున్న సమయంలో దర్శకుడు శేఖర్ కమ్ముల తన తొలి సినిమా డాలర్ డ్రీమ్స్ ద్వారా సత్యకృష్ణన్ ను టాలీవుడ్ కు పరిచయం చేశాడు. ఆ తరువాత ఆమె పెళ్ళి చేసుకుని పంజాగుట్టలో వున్న ఓ బ్యాంకులో జాబ్ లో జాయినైంది. నాలుగేళ్ళ తరువాత మళ్ళీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆనంద్ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా ఆమె పోషించిన అనిత పాత్రతో సత్యకృష్ణన్ బాగా పాపులరైంది. అంతేకాకుండా ఆ సినిమాకి ఆమెకు ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు వచ్చింది.

టాలీవుడ్ లో సహాయ నటిగా విభిన్నపాత్రలను పోషించి తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్న ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసి నటిగానే స్ధిరపడిపోయింది. బొమ్మరిల్లు, మొదటి సినిమా, వినాయకుడు, ఉల్లాసంగా ఉత్సాహంగా వంటి సినిమాలు సత్యక్రిష్ణన్ కి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. సత్యక్రిష్ణన్ హీరోయిన్ గా కూడ ప్రయత్నాలు చేసింది. ఆమధ్య పోసాని కృష్ణ మురళీ దర్శకత్వంలో వచ్చిన మెంటల్ కృష్ణ సినిమాలో హీరోయిన్ గా కూడా నటించింది. కానీ ఆ సినిమా విమర్శలపాలైంది. ఇంతవరకూ సత్యకృష్ణన్ గురించి మనందరికీ తెలిసిన సంగతులే.. కానీ కొందరికి తెలియని విషయమేమిటంటే..

సత్యక్రిష్ణన్ భర్త కూడ సినిమా రంగానికి చెందిన వ్యక్తే కావడమే ఓ అద్భుతమైన ట్విస్ట్ అని చెప్పవచ్చు. అతనెవరో కాదు.. అమృతం సీరియల్ ద్వారా బాగా పాపులరైన హర్షవర్ధనే ఆమె భర్త. వీళ్ళిద్దరూ జంటగా లవర్స్ అనే సినిమాలో కూడా నటించి మంచి గుర్తింపునే తెచ్చుకున్నారు. నటుడుగా కెరీర్ ని మొదలు పెట్టిన హర్షవర్ధన్ ఆ తరవాత డైలాగ్ రైటర్ గా మారాడు.. ఇష్క్.. గుండెజారి గల్లంతయిందే, మనం లాంటి సినిమాలకి సంభాషణలు అందించారు. ఏంటీ అవాక్కయ్యారా.. సత్యకృష్ణన్ వ్యక్తిగత విషయాలలోని ట్విస్ట్ లను చదివి..!



























