సినిమా రంగంలోకి ఎలాగోఎంట్రీ ఇచ్చినప్పటికీ తమ కెరీర్ ను నిలబెట్టుకోవడం అంత ఆషామాషీ విషయం కాదు.

సినీ పెద్ద హీరో లైనా రజనీకాంత్ చిరంజీవి మోహన్ బాబులు తమ కెరీర్ తొలినాళ్లలో ఒక పూట తింటూ మరో పూట పస్తులుంటు చెప్పులు అరిగేలా సినీ ఆఫీసుల వెంబడి తిరిగితే తప్ప తమకు అవకాశాలు దొరకలేదు కానీ వారసత్వంతో ఎంట్రీ ఇచ్చిన ఎంతో మంది నటులు సినీ రంగంలో నిలదొక్కుకోలేక పోయారు.
నాగేంద్ర బాబు,రమేష్ బాబు :

అన్న చిరంజీవి హీరోగా నటించిన రాక్షసుడు సినిమా తో ఎంట్రీ ఇచ్చిన నాగబాబు 420,అగ్రిమెంట్ లాంటి సినిమాల్లో హీరోగా కనిపించినప్పటికీ అంతగా సక్సెస్ కాలేక పోయారు. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వంగా టైగర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రమేష్ బాబు ఒకటి రెండు హిట్ సినిమాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
సుమంత్, సుప్రియ :

అక్కినేని నాగేశ్వరరావు మనవడు మనవరాలు అయినా సుమంత్ సుప్రియ ఇద్దరూ వారసత్వంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.సుమంత్ సత్యం మూవీ హిట్ కాగా సుప్రియ నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి యావరేజ్ గా ఆడింది. దీనితో వీరిద్దరూ తెరమరుగయ్యారు.
మంచు విష్ణు, మనోజ్:

మోహన్ బాబు వారసత్వంగా వచ్చిన మనోజ్ విష్ణులు తమ కెరీర్ ఇంకా ట్రాక్ లోకి రాలేదనే చెప్పాలి. విష్ణుకు “ఢీ”సినిమా తో హిట్టొచ్చినా దానిని అలానే కంటిన్యూ చేయలేకపోయారు. తమ్ముడు మనోజ్ నటించిన దొంగ దొంగది,బిందాస్ లాంటి సినిమాలు పేరు తెచ్చినప్పటికీ సూపర్ హిట్స్ లేకపోవడంతో ఇంకా తన కెరియర్ అగమ్యగోచరంగా తయారైంది.
అరుణ్, తరుణ్:

అలనాటి హీరోయిన్ రోజారమణి కొడుకు తరుణ్ సూపర్ డూపర్ హిట్ నువ్వేకావాలి సినిమా తో ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన విజయాన్ని సుస్థిరం చేసుకోలేకపోయారు. అగ్ర దర్శకుడు దాసరి నారాయణ రావు కొడుకు అరుణ్ కుమార్ గ్రీకు వీరుడు తో తెరంగేట్రం చేసినప్పటికీ తాను నటించిన సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద తీవ్ర నిరాశను కలిగించాయి.
గౌతమ్, విక్రమ్:

వీరిద్దరు కూడా ప్రముఖ హాస్య నటుల కొడుకులు అయినప్పటికీ వీరి కెరీర్ కూడా డిజాస్టర్ గా మిగిలిపోయింది. బ్రహ్మానందం కొడుకు గౌతమ్ నటించిన పల్లకిలో పెళ్లికూతురు యావరేజ్ గా ఆడింది. మరో హాస్యనటుడు అయినా ఎం ఎస్ నారాయణ దర్శకత్వం వహించిన కొడుకు అనే సినిమా ఫెయిల్యూర్ కావడంతో విక్రమ్ భవిష్యత్తు కూడా అగమ్యగోచరంగా తయారైంది.
కార్తీక, తులసి:

చిరంజీవితో కొండవీటి దొంగ,కొదమ సింహం లాంటి చిత్రాల్లో హీరోయిన్ నటించిన రాధా కూతుర్లు కార్తీక మరియు తులసి. జీవా, తులసి కలిసి నటించిన డబ్బింగ్ చిత్రం రంగం ప్రేక్షకులను మెప్పించినప్పటికీ తెలుగు తమిళ భాషల్లో ఆమె కెరీర్ ప్రశ్నార్థకంగానే మారిపోయింది. ఇక రాదా రెండవ కూతురు తులసి నటించిన కడలి మూవీ కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది… ఈ విధంగా వారసత్వం వెన్ను దన్నుగా ఉన్న సినిమా చట్రంలో ఇమడలేక వెనుతిరిగిపోతున్నారు.



























