గుజరాతి కుటుంబంలో పుట్టిన ఆర్తి అగర్వాల్ అమెరికాలోని న్యూజెర్సీ లో పుట్టి పెరిగింది. సుమారు 15 సంవత్సరాల వయసులో అమితాబచ్చన్, సునీల్ శెట్టి ఆమెను ఒక డాన్స్ షోలో చూసి… ఈ పాప చూడటానికి అద్భుతంగా ఉంది సినిమాలలో అరంగేట్రం చేయించండి గొప్ప నటిమణి అవుతుంది అని చెప్పారు. దీంతో ఆర్తి అగర్వాల్ బాలీవుడ్ పరిశ్రమలో అరంగేట్రం చేస్తాను అని చెప్పగానే ఆమె తల్లిదండ్రులు అంగీకరించారు. అలా బాలీవుడ్ పరిశ్రమలో అరంగేట్రం చేసిన ఆర్తి అగర్వాల్ తర్వాత తెలుగు పరిశ్రమలో ప్రేమకథా చిత్రాల్లో నటించి తక్కువ సమయంలోనే ఎంతో పాపులారిటీ సంపాదించింది.

మహేష్ బాబు, వెంకటేష్, బాలకృష్ణ, ఉదయ్ కిరణ్ తరుణ్ వంటి బడా హీరోల సరసన నటించి టాలీవుడ్ పరిశ్రమలో అగ్రతారగా ఎదిగింది. ఆ సమయంలోనే ఆమె అమెరికాలో జీవిస్తున్న తన చెల్లిని భారతదేశానికి రప్పించి మరీ అల్లు అరవింద్ ఫ్యామిలీ తో పరిచయం చేయించి గంగోత్రి సినిమాలో హీరోయిన్ గా పెట్టించింది. అక్క సూచనలతో నటనలో కొద్దో గొప్పో మెలుకువలు నేర్చుకున్న ఆర్తి అగర్వాల్ చెల్లి అదితి అగర్వాల్ గంగోత్రి సినిమాలో మంచి గా నటించి ప్రేక్షకులను బాగా అలరించింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆమెకు ఎన్నో సినిమా అవకాశాలు ఒకేసారి వచ్చిపడ్డాయి. అదితి అగర్వాల్ కి నితిన్ సరసన శ్రీ ఆంజనేయం సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా దర్శకుడు అయిన కృష్ణవంశీ ఆమె పూల ఘుమ ఘుమ చేరని పాటలో అందాలను విపరీతంగా ఆరబోయడం అన్న ఒక కండిషన్ పెట్టాడట. అలా చేయడం నావల్ల కాదని అదితి అగర్వాల్ చెప్పడంతో… నువ్వు చేయకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు కానీ ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపో అని కోపంగా మొహం మీదనే గట్టిగా అరిచాడట.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అదితి అగర్వాల్ ఆ తర్వాత మానసికంగా కోలుకొని కొడుకు సినిమాలో నటించింది. ఈ సినిమా అంతగా హిట్టు అవకపోవడం తో ఆమె సినీ కెరీర్ పై ప్రభావం పడింది. వర్షం సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది కానీ ఆమె అప్పటికే ఇంకొక సినిమాకి కమిట్ అవ్వడంతో వర్షం సినిమా ని వదిలేసుకుంది. దీంతో ఇద్దరు బడా డైరెక్టర్ల సినిమాలను రిజెక్టు చేసిందని అదితి అగర్వాల్ ని మిగతా ఏ దర్శకులు తమ సినిమాల్లో పెట్టుకోలేదు. ఏం బాబూ లడ్డు కావాలా సినిమాలో నటించింది కానీ అది అట్టర్ ఫ్లాప్ అవడంతో ఆమె హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది. అంతలోపే శ్రీ ఆంజనేయం సినిమా విడుదలై తొలి ఆట కే డిజాస్టర్ టాక్ ని సాధించింది. అదితి అగర్వాల్ కూడా ఈ సినిమా చూసి ఛార్మి ఒక పాటలో ఎక్స్పోజింగ్ చేసిన తీరును చూసి ఒక్క సారిగా షాక్ అయింది. ఇలాంటి సినిమాల్లో నటించిన పోవడమే మంచిదయ్యింది అని, ఇలాంటి పాత్రల్లో నటించడం కంటే సినిమా ఇండస్ట్రీని శాశ్వతంగా వదిలేయడమే బెటర్ అని ఆమె ఒక ఇంటర్వ్యూ ద్వారా చెప్పుకొచ్చింది. అలాగే సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో నటించక పోవడమే మంచి తగ్గిందని అభిప్రాయపడింది.

ఈ సమయంలోనే హీరో తరుణ్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న ఆర్తిఅగర్వాల్ అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ తరుణ్ తల్లిదండ్రులు వారి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆర్తి అగర్వాల్ బలవాన్మరనానికి పాల్పడింది. తన అక్క జీవితాన్ని దగ్గరగా చూసిన అదితి అగర్వాల్ ప్రేమ పెళ్లి అంటేనే విరక్తితో వాటిపై ఇష్టం పెంచుకోకుండా అందరికీ ఆమడ దూరం ఉంటుంది. ఎన్ఆర్ఐ ని పెళ్లి చేసుకున్న ఆర్తి అగర్వాల్ ఎక్కువగా లావు పెరగడంతో లైపోసెక్షన్ సర్జరీ చేయించుకో గా అది వికటించడంతో ఆమె 31 ఏళ్లకే చనిపోయింది. ఈ విధంగా అక్క సూచనలతో సినీ పరిశ్రమలో అరంగేట్రం చేసి కెరీర్ని నాశనం చేసుకుంది అదితి అగర్వాల్. అమెరికాలోని చక్కగా చదువుకుని ఏదో ఒక జాబ్ చేసుకున్నట్లయితే అదితి అగర్వాల్ జీవితం ఇలాగే ఉండేది కాదని ఎంత మంది అభిప్రాయపడుతున్నారు. అలాగే అక్క తరుణ్ ని ప్రేమించి మోసపోయి బలవాన్మరనానికి పాల్పడడంతో ప్రేమ, పెళ్లి అంటేనే ఆమెకు ఎక్కడలేని భయం పుట్టుకొచ్చింది. ఈ విధంగా తాను కెరియర్లో వ్యక్తిగత జీవితంలో స్థిరపడలేకపోయింది.



























